Terrorists are all around India: ఢిల్లీలో కారు బాంబు బ్లాస్ట్ తో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మరోసారి భారీగా ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ దాడి వెనుక కారణం ఎవరిది అనేది దేశ భద్రత బలగాలు తీవ్రంగా శోధిస్తున్నాయి. ప్రాథమికంగా ఒక వ్యక్తి కారులో వచ్చి ఆత్మహతి దాడి చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నిఘా వర్గాలు కొత్త విషయాలను కనుగొన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద శిబిరాలు పెరిగిపోయాయని.. భారత్కు సమీపంలో ఉన్న దేశాల్లో ఉగ్రవాద శిక్షణను కూడా జరుగుతోందని కనుగొంది. అందులో భాగంగానే ఢిల్లీ దాడి జరిగిందా? అన్న కోణంలో అనుమానిస్తున్నారు.
పుల్వామా ఘటన జరిగిన తర్వాత భారత్ ఉగ్రవాద శిబిరాలకు గురిపెట్టి ఒక్కొక్కటి కూల్చి వేసుకుంటూ వచ్చింది. ఆల్కైదా గ్రూప్ నాకు చెందిన ప్రధాన స్థావరాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ముఖ్యమైన వారిని కూడా మట్టుపెట్టినట్లు పేర్కొంది. అయితే కొన్నాళ్లు మౌనంగా ఉన్న ఉగ్రవాదులు తిరిగి పుంజుకునేందుకు భారత్ దేశానికి సమీపంలో ఉన్న దేశాల్లో శిక్షణలు పొందుతున్నట్లు భారత నిఘవర్గాలు గుర్తించినట్లు సమాచారం. భారతదేశానికి సమీపంలో ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో వీరు ఇప్పటికే చాలా వరకు శిబిరాలను ఏర్పాటు చేసుకొని శిక్షణను పొందుతున్నట్లు సమాచారం. గతంలో కంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద శిబిరాలు ఎక్కువగా మారిపోయాయని కనుగొన్నట్టు తెలుస్తోంది.
అయితే వీరికి టర్కీ దేశం సహాయం చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఉగ్రవాద శిబిరాలకు అవసరమైన ఆయుధాలు.. సంపద.. ఇతర కార్యకలాపాలన్నీ టర్కీ దేశం వీరికి అండగా ఉంటున్నట్లు కనుగొన్నారు. భారత్ చుట్టూ వల వేసినట్లుగా ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి ఆ తర్వాత దాడి కి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ జరిగిందా అన్న కోణంలో కూడా అనుమానిస్తున్నారు.
అయితే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ లో ముందుగా నిలిపి ఉన్న కారులో బాంబు బ్లాస్ట్ జరిగిందని గుర్తించారు. కానీ ఆ తర్వాత ట్రాఫిక్ లోనే ఒక వ్యక్తి కారును పేల్చేసినట్లు కనుగొన్నారు. అంటే ఉగ్రవాద శిబిరానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్ నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదులను పట్టుకుంటున్నారు. అక్రమంగా భారత్ లోకి ప్రవేశిస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. కానీ ఆత్మహతి దాడిని మాత్రం అంచనా వేయలేకపోయారు. 2011లో ఢిల్లీలో బ్రీఫ్ కేస్ దాడితో 79 మంది మరణించారు. తాజాగా జరిగిన ఘటనలో 9 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే 14 ఏళ్ల తర్వాత మరోసారి భారీగా ప్రాణానిష్టం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమై దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఉగ్రవాద విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలకు సూచించింది.