Peddi Movie highlight Scene: సినిమా ఇండస్ట్రీలో ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి టాలెంట్ ఉన్నవాళ్ళకు మాత్రమే ఇక్కడ గుర్తింపు లభిస్తోంది. వాళ్ళు మాత్రమే స్టార్ హీరోలుగా రాణిస్తారు. వాళ్ళ సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతారు. ఇక వాళ్ళ కోసమే అభిమానులు చొక్కాలు చించుకొని మరి థియేటర్లలో హంగామా చేస్తుంటారు…చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ సైతం తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ 6 హీరోల్లో తను కూడా ఒకరు కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి విజయాలను సంపాదించి పెట్టాయి. ఇక ఎప్పుడైతే ఆయన ‘రంగస్థలం’ సినిమా చేశాడో అప్పటి నుంచి తన క్రేజ్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా యాక్టింగ్ రాదు అంటూ విమర్శించిన వాళ్ళే తన యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సంవత్సరం వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ముఖ్యంగా అభిమానులైతే భారీగా డీలా పడిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ మార్కెట్ కొంతవరకు డౌన్ అయింది.
అందుకే ‘పెద్ది’ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ అనే సాంగ్ ప్రేక్షకుల యొక్క మన్ననలను పొందుతోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఒక్క సీను మాత్రం హైలైట్ అవ్వబోతుందట.
అదేంటి అంటే శివరాజ్ కుమార్ – రామ్ చరణ్ మధ్య క్రికెట్ కి సంబంధించిన ఒక పోటీ ఉంటుంది. ఆ పోటీలో రామ్ చరణ్ శివరాజ్ కుమార్ ని ఎలా ఢీకొట్టాడు అనేదే ఈ సినిమా లోని మెయిన్ సీన్ గా తెలుస్తోంది. ఇక ఈ సీన్లో ఇద్దరు పోటాపోటీగా తల పడినట్టుగా తెలుస్తోంది. ఇక శివరాజ్ కుమార్ ఫైనల్ గా రామ్ చరణ్ యొక్క ఆటకి ముగ్ధుడైపోతాడట…
రామ్ చరణ్ తన అతను ఎలా చూపించాడు. ఆయన ఎలా స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేశాడు అనేదే ఈ మూవీలో కీలకంగా మరబోతుందట… ఇదంతా మనం చూడాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…