మనం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల తృణ ధాన్యాలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. తృణధాన్యాల వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. తృణధాన్యాలలో ఒకటైన మినుములు తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు అనేక రోగాలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మినుములు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. మినుములు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మినుముల ద్వారా మన శరీరానికి అవసరమైన ఫైబర్ తో పాటు పొటాషియం, కొవ్వు లభిస్తుంది. కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ తో పాటు విటమిన్ సీ, బీ1, బీ3 విటమిన్లు లభిస్తాయి. రోజూ మినుములను తీసుకోవడంద్వారా జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే మినుములను తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఉబ్బసం, మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మినుముల్లో ఉండే పోషకాల వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎక్కువగా మినుములు తీసుకునే వాళ్లలో డయాబెటిస్ సమస్య తలెత్తే అవకాశాలు అయితే తగ్గుతాయి. రక్తహీనత సమస్యను నివారించడంలో మినుములు తోడ్పడతాయి. ఎముకలు విరిగిన వారు, కీళ్లవాతం, ఆర్థటైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు మినుములను తీసుకుంటే మంచిది. మినుముల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి.
యాంటీ-ఇన్‌ప్లమేటరీ గుణం ఉన్న మినుములు శరీరంలో మంటను తగ్గిస్తాయి. గాయాలు, నొప్పులతో బాధ పడేవాళ్లు మినుములతో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. చర్మ సౌందర్యం పెంచడంలో మినుములు తోడ్పడతాయి. పొటాషియం, పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న మినుములు గుండె జబ్బులను నివారించే అద్బుతమైన గుణం కలిగి ఉంటాయి. రక్తంలో వెలువడే చక్కెర, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి తోడ్పడతాయి.