https://oktelugu.com/

కరోనా మనిషి ప్రాణాలు తీసేది ఇలాగనా?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కరంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ భయాందళన పరిస్థితుల్లో కరోనా వైరస్ ఉధృతికి కారణమెవరు? అంటే హ్యాపీ హైపోక్సియా అని చెబుతున్నారు. మానవ శరీరంలో వైరస్ ప్రధానంగా ప్రభావం చూపే ప్రాంతం ఊపిరితిత్తులు. వైరస్ కారణంగా వీటి పనితీరు దెబ్బతిని ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా కరనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 23, 2021 / 09:00 AM IST
    Follow us on

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కరంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ భయాందళన పరిస్థితుల్లో కరోనా వైరస్ ఉధృతికి కారణమెవరు? అంటే హ్యాపీ హైపోక్సియా అని చెబుతున్నారు. మానవ శరీరంలో వైరస్ ప్రధానంగా ప్రభావం చూపే ప్రాంతం ఊపిరితిత్తులు. వైరస్ కారణంగా వీటి పనితీరు దెబ్బతిని ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా కరనా తీవ్రత ఎక్కువగా ఉన్న వారు తప్పనిసరిగా మెడికల్ ఆక్సిజన్ తీసుకోక తప్పడం లేదు. ప్రస్తుతం కరోనా రోగులను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య కూడా ఇదే. ఆక్సిజన్ కొరతతో మృత్యువాత పడుతున్నారు.

    మానవ శరీరంలో ఆక్సిజన్ స్ధాయి 95 శాతానికి పైగా ఉండాలి. అయితే హ్యాపీ హైపోక్సియా సోకిన వారిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయి 40 శాతానికి పడిపోతుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే ఊపిరి తీసుకునే పద్ధతి మారిపోతుంది. కిడ్నీలు, గుండె, మెదడు పనిచేయడం కష్టమవుతుంది. అయితే కరోనా సోకిన వారిలో ఈ లక్షణాలు కనిపించవు. దీంతో వారు చనిపోతున్నట్లు తెలుస్తోంది. మెడికల్ పరిభాషలో దీన్ని సైలంట్ హైపోక్సియా అని పిలుస్తున్నారు. మన దేశంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న కనీసం 30 శాతం మంది ప్రజల్లో ఈ సైలంట్ హైపోక్సియా అన్నట్లు చెబుతున్నారు. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. ఇది బయటకు తెలియకపోవడం వల్లే దారుణాలు జరుగుతున్నాయి. కరోనా వచ్చిన వారి కంటే జ్వరం, డయేరియాతో పోరాడుతుంటే ఈ సైలంట్ హైపోక్సియా దాడి చేస్తుందని చెబుతున్నారు. దీంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.

    బిహార్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో మెడికల్ విభాగం ప్రొఫెసర్ రాజ్ కమల్ చౌదరి ఈ విధంగా తెలియజేస్తున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు మరీ ఘోరంగా 20-30 శాతానికి పడిపోతే హ్యాపీ హైపోక్సియాగా గుర్తించడానికి సూచనలు చేశారు. పెదవులు సాధారణంగా రంగు కోల్పోయి నీలి రంగుకు మారడం, చర్మం రంగు కూడా పర్చుల్ కలర్ కు మారుతున్నా, ఎటువంటి శ్రమ చేయకున్నా విపరీతంగా చెమటలు పోస్తున్నా తక్షణమే మేల్కోవాలి. ఇవి హ్యాపీ హైపోక్సియా లక్షణాల్లో కొన్ని అని చెబుతున్నారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పులు వంటి లక్షణాలు చాలా తక్కువ మోతాదులోనే కనిపించినా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని మాత్రం తెలుసుకోవడం మానుకోవద్దని సూచిస్తున్నారు.