https://oktelugu.com/

Mung Bean Sprouts: కేవలం మొలకెత్తిన పెసర్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Mung Bean Sprouts: చాలా మంది మార్నింగ్ లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా పూరీ, ఇడ్లీ, వడ, దోశలనే తీసుకుంటారు. ఇక ఆఫీస్ లకు వెళ్లే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు, మీ ఆరోగ్యం బాగుండాలంటే అల్పాహారంగా మొలకెత్తిన పెసర్లు తీసుకోవాలి అంటున్నారు

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 15, 2024 / 03:03 PM IST

    Health Benefits of Mung Bean Sprouts

    Follow us on

    Mung Bean Sprouts: ప్రస్తుతం తినే ఆహారాలు చాలా దారుణంగా మారుతున్నాయి. సరైన ఫుడ్ ను తీసుకోవడం లేదు ప్రజలు. బిజీ బిజీ బిజీ. ఎవరిని చూసినా ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు అంటూ పరుగెడుతున్నారు. దీని వల్ల సరైన ఆహారం లేకుండా దీర్ఘకాలంగా వ్యాధులు కూడా వస్తున్నాయి. కొందరు మాంసాహారాలను తినరు. ఇలాంటి వారికి కొన్ని ప్రొటీన్లు అందవు. అలాంటప్పుడు డైట్ ప్లాన్ చేసుకోవాలి. శరీరానికి ఎన్ని క్యాలరీలు అవసరం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవాలి.

    చాలా మంది మార్నింగ్ లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా పూరీ, ఇడ్లీ, వడ, దోశలనే తీసుకుంటారు. ఇక ఆఫీస్ లకు వెళ్లే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు, మీ ఆరోగ్యం బాగుండాలంటే అల్పాహారంగా మొలకెత్తిన పెసర్లు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. మొలకెత్తిన పెసర్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ప్రతి రోజు ఉదయం మొలకెత్తిన గింజలు తినాలి. ఇక పెసర్లు మాత్రం కచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోండి. మరి మొలకెత్తిన పెసర్ల వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా ఓ సారి చూసేద్దాం.

    మొలకెత్తిన పెసర్లను తినడం వల్ల అలసట దూరం అవుతుంది. గుండె ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. రోజువారీగా మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటివి మీకు పెసర్ల ద్వారా లభిస్తాయి. వీటిలో ఉండే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ అలసటను దూరం చేస్తాయి. అంతేకాదు మంచినిద్రకు కూడా ఇవి బెస్ట్ మెడిసన్ లా పని చేస్తాయి అంటున్నారు నిపుణులు.

    పెసర్లలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచుతుంది. తరచూ తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. దీని వల్ల రక్తం గడ్డకట్టదు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మొలకెత్తిన పెసర్లలోని ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుందట. ఎసిడిటీ, కడుపు నొప్పి, పుల్లని త్రేన్పుల వంటి జీర్ణకోశ సమస్యలను మాయం చేస్తాయి పెసర్లు. ఇక ఆరోగ్యం మాత్రమే కాదు అందానికి కూడా తోడ్పడతాయి. త్వరగా వృద్ధాప్య ఛాయను రానివ్వవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

    ఇక మొలకత్తిన పెసర్లను తినడం వల్ల కంటిచూపు పెరుగుతుంది. మధుమేహ బాధితులకు ఇవి మంచి ఔషధం. రోజూ గుప్పెడు గింజలు తింటే గుండె పదిలంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి మొలకెత్తిన పెసర్లు. సంతానోత్పత్తికి, గర్భిణీలకు మొలకెత్తిన పెసర్లు చాలా ప్రయోజనాలను అందిస్తాయి. బరువును కూడా తగ్గిస్తాయి.

    కేవలం పెసర్లు మాత్రమే కాదు ఇతర మొలకలను కూడా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు ఒకే రకం తినాలి అనిపించదు. అలాంటప్పుడు వివిధ రకాల మొలకలు తినడం వల్ల బోర్ గా ఉండదు. ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. ఇక మొలకలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి. రక్త ప్రవాహంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మొలకలు తింటే గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

    శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తాయి మొలకలు. ఇవి జుట్టు, చర్మానికి అందాన్ని ఇస్తాయి. ఒత్తిడి తగ్గించడంలో సహాయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఇకనుంచి మీ డైట్ లో కచ్చితంగా మొలకలను చేర్చకోండి. వీటివల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక జీవన శైలిలో మార్పులు, శరీర ఉత్తేజాన్ని మారడం మీరే గమనిస్తారు.