ఏపీ ప్రజలు పండుగ చేసుకునే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

రేషన్‌ కొందరికి అవసరం లేకపోవచ్చు. కానీ.. చలా మందికి ఎంతో ముఖ్యం. మైళ్ల దూరం నడిచి మరీ రేషన్‌ సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు కొన్ని గ్రామాల ప్రజలు. రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడి మరీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ.. జగన్‌ ప్రభుత్వం రేషన్‌ సరుకుల తెచ్చకునే వారి కోసం శుభవార్త చెప్పింది. ఇక నుంచి రేషన్‌ కోసం మైళ్ల దూరం నడవక్కర్లేదు.. క్యూలో నిలబడనక్కర్లేదు..! Also Read: ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం […]

Written By: Srinivas, Updated On : January 21, 2021 12:12 pm
Follow us on


రేషన్‌ కొందరికి అవసరం లేకపోవచ్చు. కానీ.. చలా మందికి ఎంతో ముఖ్యం. మైళ్ల దూరం నడిచి మరీ రేషన్‌ సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు కొన్ని గ్రామాల ప్రజలు. రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడి మరీ సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ.. జగన్‌ ప్రభుత్వం రేషన్‌ సరుకుల తెచ్చకునే వారి కోసం శుభవార్త చెప్పింది. ఇక నుంచి రేషన్‌ కోసం మైళ్ల దూరం నడవక్కర్లేదు.. క్యూలో నిలబడనక్కర్లేదు..!

Also Read: ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్‌‌..!

సంక్షేమ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తానని ఎన్నికల వేళ జగన్‌ ప్రకటించారు. అందుకు తగినట్లుగానే ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. పథకాలను డోర్‌‌ డెలివరీ చేసేందుకు రెడీ అయిపోయారు. ఇందులో భాగంగా మరో పథకాన్ని ఇంటికి పంపడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ సరుకులను ప్రభుత్వం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా కొంత మందిని నియమించి వారికి సబ్సిడీ కింద వాహనాలను కూడా కొనుగోలు చేసి ఇచ్చింది. రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి. ఆ వాహనాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.

వాహనం పొందిన వ్యక్తికి ఎలాంటి ఈ పాస్ యంత్రాన్ని, బియ్యాన్ని ప్రభుత్వం ఇవ్వదు. రోజూ ఉదయం డీలర్ వద్ద తీసుకోవాలి. పంపిణీ చేసిన తర్వాత సాయంత్రం మళ్లీ అప్పగించాలి. మొబైల్‌ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు బియ్యంపంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాలి. అయితే ఈ పంపిణీలో వాలంటీర్లకు పెద్దగా బాధ్యత ఉండదు. ఇతరులకు ఉపాధి లభిస్తుంది. ఈ వాహనాలపై మూడు లక్షల వరకూ సబ్సిడీ ఇస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది.

Also Read: ఆ చానళ్ల ‘తప్పు’టడుగులు..: రేటింగ్‌ పెంచుకునేందుకు భారీ కుట్ర

గతంలో పేదలు రేషన్ దుకాణానికి వెళ్లి రేషన్ తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు.. వాహనదారుడు వచ్చి ఇచ్చే వరకూ ఎదురు చూడాలి. ప్రభుత్వం 18 రోజుల సమయం ఇచ్చింది. అంటే రేషన్ ఇవ్వడం ప్రారంభించిన 18 రోజుల్లో రేషన్‌ ఎప్పుడైనా రావచ్చు. వాహనాలు తక్కువగా ఉండటంతో ఈ సమస్య వచ్చింది. అదే సమయంలో.. వాహనాదారులు బద్దకిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించకపోతే అభాసు పాలయ్యే ప్రమాదమూ ఉంది.ఏది ఏమైనా జగన్‌ నిర్ణయంపై ఓవైపు ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నా.. అది సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ పెద్దలపై ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్