వేసవికాలంలో లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటనే సంగతి తెలిసిందే. పుచ్చకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. పుచ్చకాయలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. పుచ్చకాయ చర్మం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో పుచ్చకాయ తోడ్పడుతుంది.
Also Read: మాంసాహారులకు శుభవార్త.. శాఖాహారులుగా మారితే రూ.50 లక్షలు..?
పీచు ఎక్కువగా ఉండే పుచ్చకాయ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయ గింజలలో ఉండే పలుకులు గుండె ఆరోగ్యాన్ని ఇమడింపజేయడంతో పాటు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటాయి. తేలికగా జీర్ణమయ్యే పుచ్చకాయ మంచి పిండి పదార్థాలను కలిగి ఉంది.
Also Read: పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
నీరసం, నిస్సత్తువ లాంటి సమస్యలకు పుచ్చపండు తక్షణమే శక్తిని ఇచ్చి మానసిక ఉత్సహాన్ని, హుషారును చేకూరేలా చేస్తుంది. నీళ్లు ఎక్కువగా ఉండే పుచ్చకాయలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను పోగొట్టుకోవాలని భావించే వారికి పుచ్చకాయ ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు. పుచ్చకాయలో ఉండే అర్జినైన్ ఆనే అమైనో యాసిడ్ ఇమ్యూనిటీ పవర్ ను ఉత్తేజితం చేయడంలో సహాయపడుతుంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
పుచ్చకాయ గుజ్జులో సిట్రులిన్ అనే అమైనో అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రులిన్ నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యేలా చేయడంతో పాటు అవయవాలకు రక్తప్రసరణ మెరుగయ్యేలా చేస్తుంది. ఉబ్బసం సమస్యను నివారించడంలో కూడా పుచ్చకాయ సహాయపడుతుంది.