
టాలీవుడ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. యువ హీరోలు నితిన్, నిఖిల్, రానా సహా ఇటీవల నిహారిక, కాజల్ సైతం పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అంతా బ్యాచ్ లర్ లైఫ్ ంలోకు వీడ్కోలు పలికి సంసార జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
తాజాగా మరో యువ హీరో కూడా పెళ్లికి రెడీ అయ్యాడు. నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట.. మరో 10 రోజుల్లో అతడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 13న దీపిక అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.
కరోనా టైం కావడంతో ఈ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే సింపుల్ గా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేవలం 10 మంది టాలీవుడ్ ప్రముఖులను మాత్రమే నిర్మాత ఎంఎస్ రాజు ఆహ్వానించినట్టు తెలిసింది. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాడు.
సుమంత్ కెరీర్ మాత్రం సవ్యంగా సాగడం లేదు. నిర్మాతగా ఒకప్పుడు వెలుగు వెలిగిన ఎంఎస్ రాజు తన కొడుకును మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం ‘ఇదే మా కథ’ మూవీలో సుమంత్ నటిస్తున్నాడు.