https://oktelugu.com/

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణ ఎవరికి ఎన్ని సీట్లంటే?

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారం సాధించడం టీఆర్ఎస్ కు కష్టమని తేలిపోయింది. కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను సీఎం చేసినా కూడా తెలంగాణలో గులాబీ పార్టీకి అంత ఈజీ కాదని తేలిపోయింది. ప్రజల నాడి ఎలా ఉందనే దానిపై తాజాగా నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే దానిపై ‘సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్’ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనూహ్యమైన ఫలితాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2021 7:34 pm
    Follow us on

    ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారం సాధించడం టీఆర్ఎస్ కు కష్టమని తేలిపోయింది. కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను సీఎం చేసినా కూడా తెలంగాణలో గులాబీ పార్టీకి అంత ఈజీ కాదని తేలిపోయింది. ప్రజల నాడి ఎలా ఉందనే దానిపై తాజాగా నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి.

    ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే దానిపై ‘సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ సెఫాలజీ స్టడీస్’ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టీఆర్ఎస్ కు ఘోర ఓటమి తప్పదని సర్వే తేల్చింది. అదే సమయంలో బీజేపీకి అధికారం దక్కదని.. కాంగ్రెస్ కూడా పుంజుకుంటుందని తేలింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబర్ 28 నుంచి జనవరి 19వ తేదీల మధ్య 1.80 లక్షల శాంపిళ్లను సేకరించి ఈ సర్వే చేపట్టారు.

    ఇందులో అధికార టీఆర్ఎస్ కు ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 14-16 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే బాంబు పేల్చింది. ఇక బీజేపీకి 49 నుంచి 54 సీట్లు వస్తాయని తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 43-47 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలింది. మజ్లిస్ కు 10లోపు సీట్లు వస్తాయని తెలిపింది. ఇక కేసీఆర్ పనితీరు బాగుందని కేవలం తెలంగాణలో 21.4శాతం మంది మాత్రమే అనడం గులాబీ దండుకు షాకిస్తోంది.

    దీన్ని బట్టి తెలంగాణలో ఇక టీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమా? అన్న చర్చ సాగుతోంది. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని నిలబెట్టేంత సీట్లు రావన్న విషయం అర్థమవుతోంది. జీహెచ్ఎంసీ లాగానే తెలంగాణలో హంగ్ ఖాయంగా కనిపిస్తోంది.