మనం ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఏ పనినైనా సులభంగా చేయడం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి. ప్రతిరోజూ వాల్ నట్స్ ను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వాల్ నట్స్ తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. వాల్ నట్స్ ని రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది.
Also Read: కుండలోని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
అయితే తొక్క తీసి మాత్రమే వాల్ నట్స్ ను తీసుకోవాలి. ఎవరైతే రోజూ వాల్ నట్స్ ను తీసుకుంటారో వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 16 శాతం తగ్గుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్ నట్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేయడంలో తోడ్పడతాయి. వాల్ నట్స్ తినడం వల్ల మెటాబాలిజం ప్రక్రియ మెరుగుపడుతుంది.
Also Read: ఉదయాన్నే రన్నింగ్ చేస్తున్నారా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?
వాల్ నట్స్ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడతాయి. మచ్చలు లేని ప్రకాశవంతమైన చర్మం కావాలనుకునే వారు వాల్ నట్స్ తింటే మంచిది. రోజూ వాల్ నట్స్ తినేవాళ్లు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాల్ నట్స్ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎముకలు దృఢంగా ఉంటాయి. వాల్ నట్స్ లోని ఒమేగా 3 యాసిడ్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
నిద్రలేమి సమస్యతో బాధ పడేవాళ్లు వాల్ నట్స్ తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అథ్లెట్లు, జిమ్ కు వెళ్లి వ్యాయామం చేసేవాళ్లు వాల్ నట్స్ ను తీసుకుంటే మరీ మంచిది. వాల్ నట్స్ తినడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.