కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పోస్టల్ శాఖకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ పోస్టల్ శాఖ కొత్త స్కీమ్ లు అమలు చేసేలా ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ లు అమలు చేస్తున్న స్కీమ్ లలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా ఒకటి. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. పోస్టల్ శాఖ అందరికీ ప్రయోజనం చేకూరేలా ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
Also Read: ఇల్లు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు..?
ఈ స్కీమ్ లో ఒకేసారి లేదా విడతల వారీగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కనీసం 100 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కించి వడ్డీని చెల్లించడం జరుగుతుంది.
Also Read: తక్కువ ధరకే జియో ల్యాప్ టాప్ లు.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..?
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లలో మార్పులు చేస్తుంది. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఏకంగా 38,949 రూపాయలు వడ్డీ లభిస్తుంది. దాదాపు 40,000 రూపాయలు వడ్డీ లభిస్తున్న స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఈ స్కీమ్ లో చేరవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ లో 10,000 పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా 3,890 రూపాయల ఆదాయం వస్తుంది. పెట్టుబడికి పరిమితి లేకపోవడంతో ఈ స్కీమ్ లో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే లక్షన్నర వరకు వడ్డీ ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది.