Health Tips: పీతలతో టేస్టే కాదు.. ప్రయోజనాలు కూడా ఎన్నో..

చేపలు, రొయ్యలు మాత్రమే తినడం కాకుండా మీరు కూడా కాస్త మీ టేస్ట్ ను మార్చుకోండి. చేపలు, రొయ్యలతోటి కాస్త పీతలను కూడా చేర్చుకోండి. తినడం వరకు ఒకే మరి పీతల్లో ఉండే న్యూట్రియెంట్స్, వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి ప్రయోజనాలను ఈ పీతలు అందిస్తాయి.

Written By: Swathi, Updated On : July 27, 2024 3:05 pm

Health Benefits of Eating Crab

Follow us on

Health Tips: మాంసాహారంలో సీఫుడ్‌ టేస్ట్ టేస్ట్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. సీఫుడ్స్‌లో చేపలు, రొయ్యలు, పీతలు ప్రధానమైనంగా ఉంటాయి. వీటిలో పీతలను చాలా మంది ఇష్టపడతారు కూడా. ఎప్పుడూ చికెన్, మటన్ తినేవారు అప్పుడప్పుడూ కొత్త టేస్ట్, ఫ్లేవర్ కోసం వీటని ఎంచుకుంటారు. అయితే వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఈ పీతల్లో శరీరానికి అవసరమైన పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడతాయ. అయితే చేపలు, రొయ్యలు మాత్రమే తినడం కాకుండా మీరు కూడా కాస్త మీ టేస్ట్ ను మార్చుకోండి. చేపలు, రొయ్యలతోటి కాస్త పీతలను కూడా చేర్చుకోండి. తినడం వరకు ఒకే మరి పీతల్లో ఉండే న్యూట్రియెంట్స్, వాటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి ప్రయోజనాలను ఈ పీతలు అందిస్తాయి. తినడం వల్ల నిజంగానే ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు ఓసారి లుక్ వేసేయండి.

* మెదడు పనితీరు
వారానికి ఒకసారి అయినా వీటిని తినడం వల్ల మానసిక సమస్యలు, అల్జీమర్స్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఎన్నో పరిశోధనలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎందుకంటే సీఫుడ్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మానసిక సమస్యలకు కూడా పులిస్టాప్ పెడతాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటాయి. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి పీతలు.

* ఎముకల బలోపేతం
ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం, ఫాస్ఫరస్ ఉపయోగపడతాయి. పీత మాంసంలో ఇవి పుష్కలంగా పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ మూలకం కూడా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యం
పీతల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మంచివి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టే రిస్క్‌ తగ్గుతుంది, రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ తగ్గుతాయి. ఫలితంగా భవిష్యత్‌లో గుండెపోటు, స్ట్రోక్స్ రిస్క్ తగ్గుతుంది. మొత్తంగా హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం బాగుపడుతుంది.

* పోషకాలు
పీతల నుంచి సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ అందుతాయి. వీటిలో కండరాల బలోపేతానికి అవసరమైన ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12, సెలీనియం వంటి న్యూట్రియెంట్స్ కూడా పొందవచ్చు. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, వివిధ రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

సెలీనియం
ఇతర మాంసాలతో పోలిస్తే పీతల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండే ఈ ఖనిజం, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే సెల్ డ్యామేజ్‌ ప్రభావాలను తగ్గిస్తుంది. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.

కంటి ఆరోగ్యం
పీతల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఐరన్ మిమ్మల్ని రక్తహీనత నుంచి కాపాడుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఐరన్ మెదడు పనితీరు, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

* రక్తహీనత నివారణ
పీతలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ B12, ఫోలేట్‌ వంటి అనేక పోషకాలు అందుతాయి. ఇవి విటమిన్ లోపం కారణంగా ఏర్పడే అనీమియా ముప్పును తగ్గిస్తాయి. అనీమియా ఉన్నవారిలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి అవడం కష్టమే. ఇలాంటి సమస్య ఉన్నవారు తరచుగా అలసట, బలహీనతకు గురవుతుంటారు. అందుకే ఈ సమస్యలను నివారించాలంటే డైట్‌లో పీతలను చేర్చుకోవాలి. రక్తహీనత నుంచి బయటపడతారు.