Tollywood : మలయాళం లో ఫహాద్ ఫాజిల్, తమిళం లో విజయ్ సేతుపతి, మరి తెలుగు లో ఎవరు..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో కొన్ని వైవిధ్యమైన పాత్రలు ఉన్నాయి అంటే ఆ పాత్రలను చేయడానికి ఆయా దర్శకులకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి...

Written By: Gopi, Updated On : July 27, 2024 3:12 pm
Follow us on

Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఎన్నో రకాల పాత్రలను చేస్తూ ఇండస్ట్రీ కి సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్కొ తరంలో కొంత మంది నటులు తమ సాయశక్తుల ప్రయత్నం చేసి సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డారు. అలాగే వివిధ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా వాళ్ళ నటనల్లో పరిణితిని చూపిస్తూ ముందుకు సాగారు… ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి నటులు కరువయ్యారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన ఎస్వీ రంగారావు, జగ్గయ్య , రావు గోపాల్ రావు లాంటి గొప్ప నటులు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అలాంటి నటులు కరువయ్యారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఇప్పుడు వాళ్ల హవా కూడా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు సినిమాలు చూసే అభిమానులు నటుల నటన పట్ల వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్లు కొత్త నటుల వైపు మొగ్గు చూపే అవకాశాలైతే ఉన్నాయి. ఈ విషయానికి వస్తే మలయాళం ఇండస్ట్రీలో ఫహద్ ఫాజిల్, తమిళ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి లాంటి గొప్ప నటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విల్లన్లుగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కొత్త తరం నటులు ఎవరున్నారు అనే దాని మీదనే ఇప్పుడు తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి.

మరి ఆ విషయానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగులో అలాంటి నటులు అయితే లేరు. మరి అలాంటి నటులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన సినిమా మేకర్స్ మీదనే ఉంది. ఇక ఇదిలా ఉంటే మన సినిమాల్లో ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అంటే దానికోసం మలయాళం నుంచి గాని, తమిళ్ నుంచి గాని ఆయా నటులను తీసుకురావాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు కొదవలేదు. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి దాదాపు ముగ్గురు నుంచి నలుగురు హీరోలు ఉన్నారు. అలాగే కొంతమంది కొత్త హీరోలు కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు వస్తున్నారు.

కానీ సెటిల్డ్ గా పెర్ఫామెన్స్ ఇచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంతవరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి… ఇంతమంది నటులు ఉన్న మన సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక లోటు కనిపించడం అనేది నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మరి అలాంటి నటులు మన ఇండస్ట్రీ లో లేరా లేదంటే మన దర్శక నిర్మాతలు వారిని ఎంకరేజ్ చేయడం లేదా అనే విషయం మీదనే ఒక క్లారిటీ అయితే రావడం లేదు.

ఇక మొత్తానికైతే రాబోయే రోజుల్లో నైనా మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన సినిమా ఇండస్ట్రీ పైనే ఉందని చెప్పాలి… ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో మెయిన్ విలన్ గా చేస్తున్న ఫహాద్ ఫాజిల్ ఇక్కడ కూడా తన మేనియా ను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే విజయ్ సేతుపతి కూడా పలు సినిమాల్లో విలన్ గా చేసి తనకంటూ ఒక గొప్ప మార్కెట్ ము అయితే క్రియేట్ చేసుకున్నాడు. కాబట్టి మనవాళ్లను కూడా వాళ్ల మాదిరిగా తయారు చేయాల్సిన బాధ్యత అయితే సినిమా మేకర్స్ మీద ఉందనే చెప్పాలి…