వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలని సూచనలు చేస్తూ ఉంటారు. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఆకుకూరల ద్వారా లభిస్తాయి. అలాంటి ఆకుకూరలలో తోటకూర ఒకటి. తోటకూర తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అధిక రక్తపోటుకు చెక్ పెట్టడంలో తోటకూర సహాయపడుతుంది. గడ్డిలా కనిపించే తోటకూరలో శరీరానికి అవసరమైన కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు లభిస్తాయి.
హైపర్ టెన్షన్ తో బాధ పడే వాళ్లు తోటకూరను ఎక్కువగా తీసుకుంటే మంచిది. తోటకూర ద్వారా జింక్, కాపర్, మాంగనీస్, ఐరన్, కాల్షియం, సెలీనియం లాంటి ఖనిజాలు తోటకూర ద్వారా లభిస్తాయి. గుండెకు ఎంతో మేలు చేసే సోడియం, పొటాషియం తోటకూర ద్వారా పొందవచ్చు. తోటకూర కొవ్వును కరిగించడంతో పాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. తోటకూరలో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచడంతో పాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
తోటకూరను వేపుడులా తీసుకోవడం కంటే కూరలా తీసుకోవడం ఉత్తమం. తోటకూరలో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తోటకూర తీసుకోవడం వల్ల రక్తనాళాలు చురుకుగా ఉండటంతో పాటు గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం కూడా లభిస్తాయి. తోటకూర తక్షణ శక్తిని అందించడంతో పాటు తోటకూర ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి.
తోటకూరలో ఉండే సి విటమిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సహాయపడుతుంది. తోటకూర ఆకులను జుట్టుకు పట్టిస్తే చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. సీజన్లు మారిన సమయంలో వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో తోటకూర సహాయపడుతుంది.