https://oktelugu.com/

కేసీఆర్ కు భయపడుతున్న చంద్రబాబు.. కారణం అదేనా..?

ఏపీ ప్రతిక్షనేత.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో అభద్రతాభావం నెలకొందా..? ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు.. తన కింద పనిచేసిన కేసీఆర్ కు భయపడుతున్నారా..? అనే కామెంట్లు ఇప్పడు హాట్ టాఫిక్ గా మారాయి. తాజాగా వైసీపీ కీలకనేత, మంత్రి కొడాలినాని.. చంద్రబాబుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడే.. నాని.. ఈసారి సరికొత్త అస్త్రాన్ని వదిలారు. ఇప్పడు అది సంచలనంగా మారింది. మాజీ మంత్రి అఖిల ప్రియ .. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 7, 2021 / 11:30 AM IST
    Follow us on


    ఏపీ ప్రతిక్షనేత.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో అభద్రతాభావం నెలకొందా..? ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు.. తన కింద పనిచేసిన కేసీఆర్ కు భయపడుతున్నారా..? అనే కామెంట్లు ఇప్పడు హాట్ టాఫిక్ గా మారాయి. తాజాగా వైసీపీ కీలకనేత, మంత్రి కొడాలినాని.. చంద్రబాబుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడే.. నాని.. ఈసారి సరికొత్త అస్త్రాన్ని వదిలారు. ఇప్పడు అది సంచలనంగా మారింది. మాజీ మంత్రి అఖిల ప్రియ .. హఫీజ్ పేట భూముల వివాదంలో జరిగిన కిడ్నాప్ కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే కదా అందరికీ..

    Also Read: తమిళం వైపు ఆ ఇద్దరు సీఎంల చూపు…?

    కర్నూలులో పేరున్న టీడీపీ నాయకురాలిగా భూమా అఖిలప్రియ మంచి గుర్తింపు పొందారు. పార్టీలోనూ దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి ఆమెను అరెస్టు చేస్తే. చంద్రబాబు కానీ.. ఆయన తనయుడు మాజీ మంత్రి లోకేశ్ కానీ ఎక్కడా కూడా నోరు విప్పిన సంఘటన లేదని నాని ఆరోపిస్తున్నారు. అవును నాని చెప్పిన దాంట్లో నిజం కూడా ఉంది. అఖిలను అరెస్టు చేసి పదిరోజులు దాటుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించలేదు. కనీసం ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో అనే ఖండన కూడా పార్టీ తరఫున చేయలేదు. పార్టీ ఏ విధంగా అండగా ఉంటుందో.. లేదో..? కూడా చెప్పలేదు.. ఈ పరిణామాలు ఒక్క అఖిల ప్రియేకే పరిమితం అయ్యాయంటే .. అది కూడా లేదు..

    చంద్రబాబు వైఖరి మొదటి నుంచి తెలుగు తమ్ముళ్లను భయపెడుతూనే ఉంది. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లినప్పడు చంద్రబాబు నాయుడు దీటుగా స్పందించారు. ఏపీ సర్కారు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ నేత, మాజీ మహిళా మంత్రి పొరుగు రాష్ట్రంలో అరెస్టు అయితే.. కనీసం స్పందించడం లేదు. కారణం ఏంటో అర్థం కావడం లేదు. ఒక్కటి అక్కడి ప్రభుత్వానికి భయపడుతుండాలి..? లేదా.. మరేదైనా కారణం ఉండాలి.

    Also Read: చైనానే సూపర్ యాప్ లు ఎందుకు తయారు చేస్తోంది..?

    ఈ పరిణామం పార్టీలోని ఇతర నేతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలుగుదేశం పార్టీకోసం అఖిల ప్రియ చాలా చేసింది. అయినా ఇప్పుడు ఆమె అరెస్టు అయితే.. చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు కనీసం పన్నెత్తి పలకరించే ప్రయత్నం చేయలేదు. కన్నెత్తి చూడలేదు. అయితే రేపు మా పరిస్థితి కూడా అంతే కావొచ్చు అని ఎవరికివారు జాగ్రత్త పడుతున్నారని నిపుణులు అంటున్నారు. కానీ ఇది అంతిమంగా పార్టీని బలహీనం చేస్తుంటుందని చెబుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్