https://oktelugu.com/

నిమ్మగడ్డకు షాక్.. హైకోర్టులో పెద్దిరెడ్డికి అనుమతి?

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో ఢీ అంటే ఢీ అంటున్న మంత్రి పెద్ది రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. నిమ్మగడ్డకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని సంచలన ప్రకటన చేసి దుమారం రేపారు పెద్దిరెడ్డి. ఈ క్రమంలోనే అసలే జగన్ సర్కార్ పై ఒంటికాలిపై లేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకున్న విశేష అధికారులతో మంత్రి పెద్దిరెడ్డిని ఏకంగా 16 రోజులపాటు గృహ నిర్బంధం చేయాలని ఏపీ డీజీపీని ఆదేశించారు. దీనిపై సీరియస్ అయిన మంత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 7, 2021 / 11:54 AM IST
    Follow us on

    ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో ఢీ అంటే ఢీ అంటున్న మంత్రి పెద్ది రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. నిమ్మగడ్డకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని సంచలన ప్రకటన చేసి దుమారం రేపారు పెద్దిరెడ్డి. ఈ క్రమంలోనే అసలే జగన్ సర్కార్ పై ఒంటికాలిపై లేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకున్న విశేష అధికారులతో మంత్రి పెద్దిరెడ్డిని ఏకంగా 16 రోజులపాటు గృహ నిర్బంధం చేయాలని ఏపీ డీజీపీని ఆదేశించారు.

    దీనిపై సీరియస్ అయిన మంత్రి పెద్దిరెడ్డి ఏకంగా హైకోర్టుకు ఎక్కారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు తనను ఇంటికి పరిమితం చేసేలా డీజీపీని ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వులపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి.

    ఎన్నికల కమిషనర్ 6న ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని మంత్రి పెద్ది రెడ్డి పిటీషన్ లో ఆరోపించారు. తనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదని.. వివరాలు తీసుకోలేదని.. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

    రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారని.. ప్రొటోకాల్ ప్రకారం జిల్లా మంత్రిగా తాను ఆహ్వానించాల్సిన బాధ్యత ఉందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు కొట్టివేయాలని కోరారు.

    అయితే రాష్ట్రపతిని ఆహ్వానించేందుకు మంత్రి పెద్దిరెడ్డి వెళితే అభ్యంతరం లేదని ఎస్ఈసీ తరుఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో మధ్యాహ్నం పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ తగిలినట్టేనని అంటున్నారు.