Summer Health Tips: కుండ లో నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలకు చెక్!

Summer Health Tips: మనలో చాలామంది ఫ్రిజ్ లోని బాటిళ్లలో నింపిన చల్లని నీళ్లను తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రిజ్ లోని నీళ్ల కంటే కుండలోని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. బాష్పీభవనం సూత్రంపై పని చేసే మట్టికుండలు ఎల్లప్పుడూ నీళ్లను చల్లగా ఉంచుతాయి. కుండలోని నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో […]

Written By: Navya, Updated On : March 4, 2022 10:38 am
Follow us on

Summer Health Tips: మనలో చాలామంది ఫ్రిజ్ లోని బాటిళ్లలో నింపిన చల్లని నీళ్లను తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే ఫ్రిజ్ లోని నీళ్ల కంటే కుండలోని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పూర్వకాలంలో మట్టికుండలోని నీళ్లను మాత్రమే అందరూ తాగేవారు. బాష్పీభవనం సూత్రంపై పని చేసే మట్టికుండలు ఎల్లప్పుడూ నీళ్లను చల్లగా ఉంచుతాయి. కుండలోని నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

Summer Health Tips

ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడే వాళ్లు కుండలోని నీళ్లు తాగడం ద్వారా సులభంగా ఆ సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లను ఎక్కువ కాలం తాగడం వల్ల ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే కెమికల్స్ నీళ్లలో కలిసి శరీరానికి హాని కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: కాలినడకన ఉక్రెయిన్ నుంచి పారిపోయిన స్టార్ హీరో

మట్టి కుండలోని నీళ్లు తాగితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. మట్టికుండలోని నీళ్లు తాగడం వల్ల శరీరంలో పీహెచ్ సమతుల్యత ఉండటంతో పాటు యాసిడిటీ సమస్యలు తగ్గుతాయి. వేసవికాలంలో చాలామంది సన్ స్ట్రోక్ వల్ల బాధ పడుతుంటారు. వేసవికాలంలో కొంతమంది వడదెబ్బ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మట్టి కుండలో నీళ్లు తాగడం శరీరానికి ఎలాంటి హాని కలగదు.

మట్టి కుండలు, మట్టి పాత్రలు, మట్టి గ్లాసులను నీళ్ల కోసం వినియోగిస్తే మంచిది. ప్లాస్టిక్, స్టీల్ బాటిల్స్ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి కీడు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మరణానికి ముందు ఏం జరిగింది? చివరి మాటలు వైరల్.. షాకింగ్ నిజాలు