Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే వంటలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని తినడానికి అంతగా ఎవరూ ఇష్టపెట్టుకోరు. నాన్‌వెజ్‌లో ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించేవి ఉన్నా.. ఎక్కువ మంది చికెన్ తినడానికే ఇష్టపడతారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్నా కూడా చికెన్‌ను అధికంగా తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటుంటారు. ఇదంతా పక్కన పెడితే బేజా ఫ్రై కర్రీ నుంచి అందరికీ తెలిసిందే. మేక మెదడుతో ఫ్రై చేస్తారు. తినడానికి ఈ ఫ్రై కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు తింటే అసలు లైఫ్‌లో వదిలిపెట్టరు. అయితే ఈ బేజా ఫ్రై వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలియాలంటే ఆలస్యం చేయకుండా ఆర్టికల్ మొత్తం చదివేయండి.
బేజా ఫ్రైలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. మేక మెదడులో ఎక్కువగా ప్రొటీన్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో బేజా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు దీనిని ఎక్కువగా పెడితే వారు తెలివిగా ఉంటారు. అయితే కొందరు దీనిని బాగా ఫ్రై చేసుకుని తింటే.. మరికొందరు మసాలా పెట్టి కర్రీలా చేసుకుంటారు. మేక మెదడులో గుండెని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి. ఇవి రక్త సరఫరాను పెంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గుండె పోటు వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఇందులోని పోషకాలు లైంగిక కోరికలను కూడా పెంచుతాయి. లైంగిక సమస్యలో ఇబ్బంది పడేవారికి బాగా ఉపయోగపడతాయి.
ఇందులో లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పిల్లలకు దీనిని పెట్టడం వల్ల చిన్నప్పటి నుంచి వారి కండరాలు బలంగా పెరుగుతాయి. అలాగే ఇందులో విటమిన్లు, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. బేజా ఫ్రైలో విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది బాగా సాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్ తొందరగా ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా వీటిని తినవద్దు. నెలకి రెండు నుంచి మూడుసార్లు మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం ఈ బేజా ఫ్రైకి దూరంగా ఉండటమే మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.