https://oktelugu.com/

Social media influencers : సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలి అనుకుంటున్నారా? కానీ ఇన్‌ఫ్లుయెన్సర్ల మానసిక స్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే?

ఇన్‌ఫ్లుయెన్సర్లు డిప్రెషన్‌కి ఎందుకు గురవుతున్నారు అనే వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక సర్వే ప్రకారం, చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒత్తిడికి గురి అవుతున్నారు. అంచనాలు, టార్గెట్లు పూర్తి కాకపోవడం లేదట. దీంతో బ్రాండ్ కొలాబరేషన్ గురించి ఆందోళన, ప్రైవసీ, వంటి విషయాలతో

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 22, 2024 10:07 pm
    Social media influencers

    Social media influencers

    Follow us on

    Social media influencers : ఈ మధ్య సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాడకం పెరిగింది. దీంతో బ్రాండ్లు, పరిశ్రమలు మార్కెటింగ్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ విలువ మల్టీ-బిలియన్ డాలర్లకు చేరుకుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కానీ మరోవైపు ఇన్‌ఫ్లుయెన్సర్లలో డిప్రెషన్ రేటు గణనీయంగా పెరిగిందనే విషయం మీకు తెలుసా?. ఈ విషయంపై ఇన్‌ఫ్లుయెన్సర్ మయూరి జాదవ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ” సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే ఇన్‌ఫ్లుయెన్సర్లలో డిప్రెషన్, నిద్రలేమి వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని పేర్కొన్నారు.

    ఇన్‌ఫ్లుయెన్సర్లు డిప్రెషన్‌కి ఎందుకు గురవుతున్నారు అనే వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక సర్వే ప్రకారం, చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒత్తిడికి గురి అవుతున్నారు. అంచనాలు, టార్గెట్లు పూర్తి కాకపోవడం లేదట. దీంతో బ్రాండ్ కొలాబరేషన్ గురించి ఆందోళన, ప్రైవసీ, వంటి విషయాలతో బాధపడుతున్నారని సర్వేలో తెలిసింది. కొన్నిసార్లు కామెంట్ల రూపంలో వీరిని తిడుతుంటారు కొందరు. వీటి వల్ల మరింత మానసిక ఒత్తిడి, డిప్రెషన్ లలోకి వెళ్తున్నారని సమాచారం. ఈ రంగంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి అంటున్నారు నిపుణులు. ఈ విషయంపై సైకాలజిస్ట్ డా. పూర్వి భిమాని కీలకమైన విషయాలను వెల్లడించారు. ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తర్వాత కలిగే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మరి వాటిని కూడా తెలుసుకోండి.

    నిరంతర ఫాలోయింగ్, రీచ్ ల గురించి ఆలోచించడం అలవాటుగా మారుతుంది కాబట్టి వీరికి ఒత్తిడి పెరుగుతుంది. రీల్స్ పేరుతో తమ పర్సనల్ లైఫ్ ను చాలా విషయాల వరకు పబ్లిక్ చేస్తుంటారు. మొదట్లో ఇది బాగానే ఉన్నా.. రాను రాను ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ముందు నుంచి ఉన్న వీడియోలు డిలీట్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే ఉంటుంది. ఫలితంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకొని డిప్రెషన్ లోకి వెళ్తుంటారు చాలా మంది.

    ఇక ఈ విషయంలో ఆదాయ స్థాయి స్థిరంగా ఉండదు. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వృత్తి వల్ల నిజమైన సంబంధాలపై ప్రభావం పడవచ్చు, ముఖ్యంగా ఫాలోవర్స్, కెరీర్ మధ్య సమతుల్యత సాధించడం కష్టమైతే ఈ సమస్య మరింత పెద్దగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా ఉండటం, ఎప్పుడు సరైన ప్రవర్తన కనబరచాలనే అంచనా వల్ల నిత్యం సతమతం అవుతుంటారు. ఈ ప్రభావాల వల్ల కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు సరిగ్గా తినడం కూడా కష్టంగా మారుతుంది.

    కొందరు ఏకంగా ఒంటరిగా ఉంటున్నారు. చిరాకు పడతుంటారు. కుటుంబంపై కోపం చూపిస్తుంటారు. తమ కోరికలు నెరవేరక పోవడం వల్ల అహం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఈ అన్ని విషయాలను ఎదుర్కోవడం కొన్నిసార్లు కష్టం అనే చెప్పవచ్చు. దీని నుంచి బయటపడాలంటే కుటుంబ మద్దతుతో పాటు మనం ఏం చేస్తున్నామో అనే విషయం మీద కచ్చితంగా క్లారిటీ అవసరం అంటున్నారు నిపుణులు. క్లారిటీ లేకపోతే సోషల్ మీడియా మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది.