Health Benefits: మన వంటగదిలో ఉండే అనేక మసాలా దినుసులు వంటలను టేస్టీగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తాయి. మసాలా దినుసుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడం, బరువు తగ్గడం, నిద్రపోవడం, పీరియడ్స్ సమస్యలు లేదా జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే వంటగదిలో ఎక్కువగా ఉండే జాపత్రితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు శరీరంలోని అన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. ఈ జాప్రతిని సరైన పద్ధతిలో వాడితే దీర్ఘకాలిక సమస్యల నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. పూర్వం కనీసం మసాలా కూరల్లో అయిన దీన్ని విరివిగా వాడేవారు. కానీ ఈ రోజుల్లో కనీసం వంటల్లో కూడా వాడటం లేదు. ఈ జాపత్రిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే ఈ జాపత్రిని ఎలా వాడితే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాపత్రితో వంట్లోనే కాకుండా టీలో కూడా వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే సీజనల్ వ్యాధుల నుంచి దూరం పెడతాయి. కొందరు తరచుగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఈ జాపత్రి టీ బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఈ టీని తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది. శరీరంలో ఉండే కొవ్వును కూడా ఈ టీ తగ్గిస్తుంది. డైలీ ఈ టీ తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
డైలీ ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి స్థాయిలు అదుపులో ఉండటంతో పాటు చర్మం కూడా మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు విడుదల చేస్తాయి. నెలసరి నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ జాపత్రి టీ బాగా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు క్యాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తుంది. అలాగే గుండె పోటు సమస్యలు, జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో డైలీ టీ చేసి తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. రోజూ ఈ టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. అయితే రోజూ ఈ తాగడం కుదరకపోతే కనీసం వారానికి ఒకసారి అయిన తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.