Relationship With Another Man: ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. బంధువులు, స్నేహితుల మధ్య ఆడంబరంగా పెళ్లి జరుపుకొని ఒక్కటైన జంట అన్యోన్యంగా ఉండాలని అందరూ దీవిస్తారు. కానీ వీరు సక్రమమైన జీవితం కాకుండా తప్పుడు పనులు చేస్తున్నారు. కపుల్స్ లో ఎవరో ఒకరు పక్కదారి పడుతూ సంబంధాలను దెబ్బతీస్తున్నారు. కష్టమైనా.. నష్టమైనా.. భార్యభర్తలు కలిసి ఉండాలని పెద్దలు చెబుతున్నారు. కానీ చిన్ని చిన్న కారణాలతోనే నేటి కాలంలో దంపతులు కలిసి ఉండలేకపోతున్నారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి ఎవరో ఒకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఓ వివాహిత భర్తను కాదని వేరే వ్యక్తితో కలిసి ఉండడం ప్రారంభించింది. కానీ ఆ తరువాత ప్రాణాలు తీసుకుంది. అందుకు కారణాలు ఏంటంటే?
కేరళ రాష్ట్రానికి చెందిన కురుప్పసామి అనే వ్యక్తి కూలీ పని చేస్తున్నాడు. ఈయనకు అదేప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఇరు కుటుంబాల అంగీకారం తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇష్టాన్ని తెలియజేశారు. దీంతో వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఆడంబరంగా నిర్వహించారు. ఆ తరువాత ఈ జంట కొన్నాళ్ల పాటు అన్యోన్యంగా జీవితం కొనసాగించింది.
అయితే ఈ దంపతులకు కొన్నాళ్ల గడిచినా పిల్లలు కాలేదు. ఈ సమయంలో వివాహిత రామ్ కుమార్ అనేవ్యక్తితో సంబంధాన్ని కొనసాగించింది. తరుచూ వీరిద్దరు రహస్యంగా కలుసుకునేవారు. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. అయినా వినకుండా కురుప్ప స్వామి బయటకు వెళ్లిన సమయంలో ఏకాంతంగా కలుసుకునేవారు. ఇటీవల భర్త ఏదో ఊరికి వెళ్లిన సమయంలో వీరు ఆ వివాహిత ఇంట్లో కలుసుకున్నారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చూశాడు.దీంతో బయట తలుపు గడియపెట్టాడు.
ఈ పరిస్థితిని గమనించిన వివాహిత తలుపు తీయాలని వేడుకుంది. కానీ ఆ వ్యక్తిగ్రామస్థులంతా వచ్చే వరకు వెయిట్ చేశాడు. అయితే ఆ వివాహిత అవమాన భారంతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇదే సమయంలో రామ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఇంట్లోనే అటుకుపైన దాక్కొని ఉన్నాడు. వివాహిత మరణించిన సమయంలో తాను గమనించలేదని పోలీసులకు తెలిపాడు. ఆ తరువాత గ్రామస్థులంతాకలిసి తలుపు తీయడంతో అప్పటికే ఆ వివాహిత మరణించింది. పోలీసులు సంఘటనా స్థలాన్నిపరిశీలించి రామ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో భర్త ఉండగా వివాహిత వేరే వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు రకరకాలుగా చర్చించుకున్నారు. ఆ తరువాత కురుప్పస్వామి ఊరి నుంచి తిరిగి వచ్చి పరిస్థితిని చూసి బోరున విలపించాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వివాహేతరసంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే వీరికి పిల్లలు కాకపోవడంతో ఎలాంటి నష్టం కాలేదు. కానీ పిల్లలు ఉంటే వారిపై తీవ్ర ప్రభావం ఉండేదని చర్చించుకుంటున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మానవ సంబంధాల విషయంలో తప్పుడు దారులు పట్టొద్దని సూచిస్తున్నారు.