Health: రోజంతా పోషకాలు ఉండే ఆహారం తినడం ఎంత ముఖ్యమో.. రాత్రి (Night) సమయాల్లో తినడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఈ రోజుల్లో రాత్రి సమయాల్లో పోషకాలు లేని ఆహారాన్ని (food) ఎక్కువగా తింటున్నారు. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలతో (Health Issues) బాధపడుతున్నారు. వీటివల్ల రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. దీంతో ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి సమయాల్లో కొన్ని ఫుడ్స్ తినకూడదు. పొరపాటున అయిన ఇలాంటి ఫుడ్స్ తిన్నారో.. ఇక మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రాత్రిపూట తినకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వేయించిన ఆహారాలు
రాత్రి సమయాల్లో బాగా వేయించిన వాటిని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ ఫిష్, మోజారెల్లా స్టిక్స్ వంటివి అసలు తినకూడదు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో ఊబకాయం వంటి సమస్యల బారిన పడతారు. కాబట్టి రాత్రి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకోవద్దు.
స్నాక్ ఫుడ్స్
కొందరికి రాత్రి సమయాల్లో ఫుడ్ తినడం ఇష్టం లేకపోతే స్నాక్స్ తింటారు. జంతికలు, చిప్స్ లేదా పాప్ కార్న్ వంటివి ఎక్కువగా తింటారు. ఇలాంటి వాటిని రాత్రి సమయాల్లో తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె పోటు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఫైబర్ కాకుండా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. కాబట్టి రాత్రి సమయాల్లో ఇలాంటి స్నాక్స్ అసలు తినవద్దు.
కెఫిన్ పదార్థాలు
రాత్రి సమయాల్లో కెఫిన్ ఉండే పదార్థాలు అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్రకు ఒక రెండు లేదా మూడు గంటల ముందు బ్లాక్ టీ, గ్రీన్ టీ, కాఫీ, సోడా వంటివి తీసుకోకూడదు. వీటివల్ల రాత్రి సమయాల్లో నిద్ర పట్టదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్పైసీ ఫుడ్స్
రాత్రి సమయాల్లో స్పైసీ ఫుడ్స్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మసాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. వీటి వల్ల అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి అన్ని వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో ఇలాంటి స్పైసీ ఫుడ్స్‌ను అసలు తీసుకోవద్దు.
స్వీట్లు
కొందరికి భోజనం తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్వీట్లు తినవద్దు. ఈ అలవాటు ఉంటే మానేయడం బెటర్ అని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు సిట్రిక్ ఆమ్లం ఉండే వాటిని కూడా తినకూడదని నిపుణులు అంటున్నారు. వీటిని రాత్రి సమయాల్లో తినడం వల్ల అవి విషంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.