ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలా సీరీస్ లు వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లను చూసిన ఆడియన్స్ కొత్త జానర్ లో ఎలాంటి వెబ్ సిరీస్ లు వచ్చిన కూడా ఆదరిస్తున్నారు. ఇప్పటికీ 2020 వ సంవత్సరంలో ‘పాతల్ లోక్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. చాలామంది ప్రేక్షకులు ఈ సిరీస్ ను చూసి చాలా ఎక్సైట్ అయినట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ని ప్రేక్షకులను ఇష్టపడడం అనేది చాలా మంచి విషయమనే చెప్పాలి. ఇక ఆ సీరీస్ వచ్చిన 5 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా ప్రస్తుతం ‘పాతాల్ లోక్ సీజన్ 2’ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది… మరి సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా మొదటి సిరీస్ తో పోలిస్తే ఈ సిరీస్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
పోలీస్ స్టేషన్ లో రెగ్యులర్ గా డ్యూటీ చేసుకుంటున్న ఎస్ఐ కి ఒక రోజు ఆ ఏరియాలో ఒక మర్డర్ జరగడం తో ఆ కేసు ఆ స్టేషన్ కి వస్తుంది. దాంతో దాన్ని సాల్వ్ చేయడానికి ఎస్ఐ ముందుకు సాగుతాడు. ఆ ప్రాసెస్ లో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక మొత్తానికైతే ఆ మర్డర్ చేసింది ఎవరు వాళ్లకి పోలీసులకి మధ్య సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సిరీస్ విశ్లేషణ విషయానికి వస్తే మొదటి సిరీస్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే ఈ సీజన్ స్టార్ట్ అయింది. ఇక దర్శకుడు అవినాష్ అరుణ్ దావర్ సిరీస్ ని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎక్సైటింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నప్పటికి ఒక ఎపిసోడ్ కూడా బోర్ లేకుండా ముందుకు తీసుకెళ్లడం లో అతను చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి ఎపిసోడ్ 45 నుంచి 45 నిమిషాలకు డ్యూరియేషన్ తో సాగుతున్నప్పటికీ ఎక్కడ కూడా సిరీస్ బోర్ అనిపించదు. ఆ క్రెడిట్ మొత్తం తనకే ఇవ్వాలి.
ఇక ఎక్కడైతే హై ఎలిమెంట్స్ ని అందించాలో అక్కడ కరెక్ట్ గా స్క్రీన్ ప్లే ని బ్యాలెన్స్ చేస్తూ అప్ అండ్ డౌన్స్ ఇస్తు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమైతే చేశాడు. మొదటి సిరీస్ ఎంతైతే క్లిక్ అయిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్ ని అంతకంటే పెద్ద సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతోనే దర్శకుడు చాలా ఎక్సైటింగ్ గా స్క్రీన్ ప్లే ను రాసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే వస్తుంటాయి. వాటిని పోలీసులు ఎలా సాల్వ్ చేస్తారు అనేది సిరీస్ చూసే ప్రతి ప్రేక్షకుడికి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది…
ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన థ్రిల్లర్ లో ఈ సిరీస్ చాలా మంచి రెస్పాన్స్ ని అందుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దర్శకుడు ప్రతి క్యారెక్టర్స్ మధ్య ఏర్పాటు చేసిన కాన్ఫ్లిక్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా కుదిరింది. ట్విస్టులు అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయనే చెప్పాలి… కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ ని క్యారీ చేసే విధంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఉండడం సిరీస్ కి చాలా వరకు ప్లస్ అయింది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో మెయిన్ రోల్ పోషించిన జయదీప్ అహల్వత్ చాలా మంచి పర్ఫామెన్స్ అయితే ఇఛాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా ముందుకు సాగింది అంటే అతని యాక్టింగ్ లోని స్కిల్స్ కూడా చాలావరకు హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నటుడు ఎలాంటి క్యూరియాసిటీతో ఉంటాడు అనేది ఆయన హావ భావాల్లో పలికిస్తూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా అతని నటన తో కట్టి పడేసాడనే చెప్పాలి… ఇక విశ్వాంక్ సింగ్ కూడా ఈ సినిమాలో అద్భుతమైన నటనని కనబరిచాడు. ఆయన నటించిన క్యారెక్టర్ లో డిఫరెంట్ షెడ్స్ పలికించాడు. ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ కూడా ఈ సిరీస్ కి చాలా వరకు ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే సాగదీతగా లేకుండా చాలా గ్రిప్పింగ్గా ఉండడంతో మ్యూజిక్ లో కూడా ఒక వైవిధ్యాన్ని ప్రదర్శించేసరికి ప్రేక్షకులకు ఈ సిరీస్ మీద చాలా కొత్త ఫీల్ అయితే వచ్చింది. ఈ సిరీస్ ని ఎంగేజింగ్ గా చూడడానికి మ్యూజిక్ అనేది కూడా చాలా వరకు ప్లస్ అయింది…ఇక సినిమాటోగ్రాఫర్ కూడా ఈ సిరీస్ చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ రాకుండా చాలా మంచి విజువల్స్ అయితే అందించాడు…
ప్లస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
ట్విస్టులు
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
లెంత్ ఎక్కువ అవ్వడం…
కొన్ని అనవసరపు సీన్స్…
రేటింగ్
ఈ సిరీస్ కి మెమిచ్చే రేటింగ్ 2.5/5