Kidney Stones: ప్రతి ఒక్కరు కూడా నీరు తాగడం చాలా అవసరం. శరీరానికి తగినన్ని నీటిని అందించడం వల్ల చాలా సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. నీరు సరిగ్గా తాగకపోవడం కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి.. దీనివల్ల శరీరంలోని విసర్జక పదార్థాలు మూత్ర నాళంలో చిన్నపాటి రాయి మాదిరి తయారవుతాయి. ఇలా తయారు కావడాన్నే కిడ్నీలో స్టోన్లు వచ్చాయి. రాళ్లు వచ్చాయి అంటారు. అయితే కిడ్నీ సమస్యల నుంచి బయట పడాలంటే నీరు తగినంత ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నీరు చాలా ఉపయోపడతుంది. అదేంటో తెలుసా?
మూత్రనాళంలో కిడ్నీ స్టోన్స్ వస్తే యూరిన్ వెళ్లే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. చిన్నపాటి రాళ్లు అయితే ట్యాబ్లెట్స్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాటిని బయటకు పంపేయవచ్చు. కానీ సైజ్ పెద్దగా పెరిగితే మాత్రం కొన్ని సార్లు శస్త్ర చికిత్స కూడ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కిడ్నీలోని రాళ్ల సమస్యకు కొబ్బరి నీళ్ల అద్భుత ఔషధమని అంటున్నారు నిపుణులు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ కొబ్బరి నీరు. ఇది కిడ్నీలో రాళ్లను నివారించి శరీరంలోని కొన్ని సమస్యలను నివారిస్తుంది.
కొబ్బరి నీరులో పొటాషియం, మెగ్నీషియం, సోడియంతో సహా ఎలక్ట్రోలైట్లు ఎక్కువ ఉంటాయి. శరీరంలోని ద్రవాలను నియంత్రించి మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో ప్రోటీన్లను యాక్టివ్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఖనిజాలు, లవణాల గట్టి నిక్షేపాలు కిడ్నీ స్టోన్స్ . కొబ్బరి నీళ్లు తాగడం వల్ల టాక్సిన్స్‌ను బయటకు పంపవచ్చు. క్రియేటినిన్ స్థాయిలను తగ్గిస్తే స్ఫటికీకరణను నిరోధించవచ్చు. ఇది కొబ్బరినీరు వల్ల సాధ్యం అవుతుంది. కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రం పలచగా వస్తుంది. నీరు చిన్న చిన్న స్పటికాలుగా మారకుండా నిరోధిస్తుంది కొబ్బరినీరు. మంచి ఫలితాల కోసం కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలను కలపి తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.
స్టోన్లు బాగా పెరిగే వరకు తెలియకుండా ఉంటే మాత్రం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే కిడ్నీ స్టోన్లను నిజానికి ఆరంభంలోనే గుర్తించడం సులభమే అంటున్నారు నిపుణులు. శరీరం మనకు పలు లక్షణాలు, సూచనల ద్వారా తెలియజేస్తుంది. ఈ లక్షణాలను గుర్తించి నిర్దారిస్తే.. కిడ్నీ స్టోన్‌లను ఆరంభంలోనే తొలగించుకోవచ్చు. కిడ్నీ స్టోన్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడమ పక్కన ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. లేదా ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడమ వైపు నొప్పి వస్తుంటుంది. ఇక ఈ నొప్పి పోటు పొడుస్తున్నట్టుగా ఉంటుంది.