https://oktelugu.com/

Periods Time : పీరియడ్స్ టైంలో పొత్తికడుపులో నొప్పి భరించలేకపోతున్నారా? దీన్ని తగ్గించడం ఎలానంటే?

నెలసరి సమయంలో మహిళలు ఇంటికే పరిమితమవుతారు. ఈ టైంలో వచ్చే మార్పుల వల్ల వాళ్లు బయటకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఈ సమయంలో మహిళలు డిస్మెనోరియా కారణంగా కడుపులో నొప్పిని ఎదుర్కొంటారు. శరీరంలో గర్భాశయ సంకోచాలను కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2024 5:41 pm
    Follow us on

    Periods Time  : నెలసరిలో చాలామంది పొత్తికడుపు నొప్పితో బాధపడతారు. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. రెండు నుంచి మూడు రోజుల వరకు ఈ నొప్పి ఉంటుంది. ఈ సమయంలో కేవలం కడుపు నొప్పి మాత్రమే కాకుండా నడుం నొప్పి, కాళ్లనొప్పి, నీరసం, అలసట, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఈ మార్పులన్నీ నెలసరిలో సాధారణమే. ఇదెలా ఉండగా అసలు పీరియడ్స్‌లో తట్టుకోలేని నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి చిట్కాలేంటి? ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

    నెలసరి సమయంలో మహిళలు ఇంటికే పరిమితమవుతారు. ఈ టైంలో వచ్చే మార్పుల వల్ల వాళ్లు బయటకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఈ సమయంలో మహిళలు డిస్మెనోరియా కారణంగా కడుపులో నొప్పిని ఎదుర్కొంటారు. శరీరంలో గర్భాశయ సంకోచాలను కలిగించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయ లైనింగ్ తొలగించడానికి సహాయపడే ఈ సంకోచనాలనే కడుపు నొప్పిగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వచ్చే మార్పులన్నీ సహజమే. కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఈ నొప్పి ఉంటుంది. అయితే ఈ నొప్పి నుంచి విముక్తి పొందాలంటే గ్లాసు అల్లం రసంలో తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. పీరియడ్స్‌లో ఏదైనా తినాలనిపించడం, కోపం, మనకి తెలియకుండా ప్రవర్తనలో మార్పులు కామన్. అయితే ఈ టైంలో విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం మంచిది. నొప్పిని తట్టుకోవడానికి హీటర్ ప్యాడ్ పొత్తి కడుపుపై పెట్టాలి. అలాగే డార్క్ చాక్లెట్స్, పండ్లు, రసాలు తీసుకుంటే నీరసం తగ్గుతుంది. ఈ సమయంలో కెఫిన్ ఉండే పదార్థాలు, మద్యం, ధూమపానంకి దూరంగా ఉంటే బెటర్.

    పీరియడ్స్ నొప్పిని తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు. అయితే ఇవి వాడటం అంతమంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే నెలసరిలో నొప్పి అనే సర్వసాధారణం. ఈ నొప్పిని తట్టుకోవడానికి సహజంగా చిట్కాలు పాటిస్తే పర్లేదు. కానీ మందులు వాడటం ఆరోగ్యానికి అంతమంచిది కాదట. కష్టతరమైన వ్యాయామాలు కాకుండా సులభంగా ఉండేవి చేయాలి. యోగా, మెడిటేషన్‌తో పాటు వాకింగ్ చేయాలి. ఈ సమయంలో మజ్జిగ, అల్లం రసం, పుదీనా టీ తాగితే నొప్పుల నుంచి విముక్తి చెందుతారు.

    నెలసరిలో విటమిన్-బి6, విటమిన్-సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలి. వీటివల్ల నెలసరి నొప్పి తగ్గడంతోపాటు సరైన సమయానికి పీరియడ్స్ వస్తాయి. కొందరు సరైన టైంకి పీరియడ్స్ అవ్వరు. లేటుగా అవుతుంటారు. మీకు ఈ సమస్య ఉంటే చిన్న చిట్కాలు పాటించండి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 10నిమిషాల పాటు మరగబెట్టి, చల్లార్చి వడపోసుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం కలిపి మూడు వారాలకి ఒకసారి తాగితే నెలసరి సరైన సమయానికి వస్తుంది. అలాగే నెలరోజుల పాటు మెంతి ఆకును కూరగా చేసి తింటే పీరియడ్స్ సరైన టైంకు వస్తుంది. దాల్చిన చెక్కను పొడి చేసి, గోరువెచ్చని పాలలో కలిపి తాగితే రెగ్యులర్ పీరియడ్స్ అవుతారు.