Diabetes: డయాబెటిస్ ఉందా? రైస్ తినాలా వద్దా? తింటే ఎప్పుడు తినాలి?

డయాబెటిస్ ఉన్నవారు పూర్తిగా అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదంటున్నారు. డైలీ డైట్‌లో అన్నాన్ని చేర్చుకోవచ్చని.. కానీ క్రమ పద్దతిలో తినాలి అంటున్నారు డైటీషియన్ లు.

Written By: Swathi Chilukuri, Updated On : July 3, 2024 4:02 pm

Diabetes

Follow us on

Diabetes: డయాబెటిక్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారం విషయంలో తాగే కూల్ డ్రింక్స్ విషయంలో జాగ్రత్త మస్ట్. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. డయాబెటిస్ ఉంటే అన్నానికి కాస్త దూరంగా ఉండాలి అంటారు నిపుణులు. తెలుగు ప్రజలకు అన్నం తినడం అంటేనే ఇష్టం. అలాంటిది పూర్తిగా అన్నం మానేయమంటే మానేస్తారా? మరి అన్నం విషయంలో వైద్యులు ఏమంటున్నారో తెలుసా?

డయాబెటిస్ ఉన్నవారు పూర్తిగా అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదంటున్నారు. డైలీ డైట్‌లో అన్నాన్ని చేర్చుకోవచ్చని.. కానీ క్రమ పద్దతిలో తినాలి అంటున్నారు డైటీషియన్ లు. కేవలం రోజుకు ఒకసారి 30-40 గ్రాముల బియ్యం తీసుకోవాలి అని.. దీని వల్ల బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది అంటున్నారు. ఇందులో అంటే 30-40 గ్రాముల బియ్యంలో 150 నుంచి 170 కేలరీలు ఉంటాయట. ఇలా తినడం వల్ల బరువు పెరగరని, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌ పెరుగుతుంది. కాబట్టి, షుగర్ స్పైక్‌ను నియంత్రించడానికి, బియ్యంతో తగినంత ప్రోటీన్ ఫైబర్ తినాలని సూచిస్తున్నారు. అంటే కూరగాయలు, చేపలు, చికెన్, సలాడ్ వంటివి తీసుకోవడం ముఖ్యం.

మధ్యాహ్నం లేదా జిమ్, వ్యాయామం చేసిన తర్వాత అన్నం తినాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలో అన్నం తినడం వల్ల ఆ తర్వాత పనుల మీద తిరుగుతూ నడుస్తూ ఉంటారు కాబట్టి సమస్య ఉండదు. దీనివల్ల బరువు పెరగరు. బరువు కూడా అదుపులో ఉంటుంది.