https://oktelugu.com/

Dengue Fever: డేంజర్ డెంగ్యూ నుంచి తప్పించుకోవడం ఎలా?

ఉదయం, సాయంత్రం దోమలు విపరీతంగా ఉంటాయి కాబట్టి వీటిని వికర్షించే మస్కిటో రిపెలెంట్స్‌ ఉపయోగించాలి. ముఖ్యంగా పికారిడిన్, లెమన్ యూకలిప్టస్ ఆయిల్ వంటివి బెటర్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 3, 2024 / 04:28 PM IST

    Dengue Fever

    Follow us on

    Dengue Fever: వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు వెంటనే వస్తుంటాయి. రోగనిరోధక శక్తి ఉన్న వారు త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు. ఇక ఈ కాలంలో దోమలు మరింత పెరుగుతాయి. ఈ దోమలు డెంగ్యూ వైరస్ ను వ్యాప్తి చెందుతాయి. ఇండియాలో తెలంగాణ, ఆంధ్రాలో ఈ డెంగీ కేసులో ఎక్కువ నమోదు అవుతుంటాయి. చాలా ప్రమాదకరమైన ఈ వ్యాధి నుంచి సులభంగానే బయటపడవచ్చు. మరి డెంగ్యూ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    ఉదయం, సాయంత్రం దోమలు విపరీతంగా ఉంటాయి కాబట్టి వీటిని వికర్షించే మస్కిటో రిపెలెంట్స్‌ ఉపయోగించాలి. ముఖ్యంగా పికారిడిన్, లెమన్ యూకలిప్టస్ ఆయిల్ వంటివి బెటర్. డెంగీని వ్యాప్తి చెందించే దోమలు నీటిలో ఎక్కువగా పెరుగుతుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, కూజాలు, డబ్బాలలో నీరు చేరి నిల్వ ఉంటుంది. ఇందులో త్వరగా దోమలు పెరుగుతాయి. వీటిలో నీటిని తొలగించండి. డ్రమ్ములు, ట్యాంకులు ఉంటే వాటిని మూతతో కవర్ చేయండి.

    జాగ్రత్తలు:
    ఇంటి చుట్టూ చెరువులు, కుంటలు ఉంటే జాగ్రత్త. దోమలు కుట్టకుండా పొడవైన స్లీవ్స్ ఉండే దుస్తులు ధరించండి. శరీరం మొత్తం కప్పి ఉంచేలా చూసుకోండి. కాళ్లను కూడా కవర్ చేసే ప్యాంట్లు వేసుకోండి. కుదిరితే సాక్స్ లు కూడా వేసుకోవాలి. డెంగ్యూ వస్తే శరీరంలోని నీరు మొత్తం పోతుంది. అందుకే రోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తీసుకోవాలి. కొబ్బరి నీరు, ORS డ్రింక్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ శరీరానికి కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తాయి కాబట్టి వీటిని తీసుకోవాలి.

    లక్షణాలు:
    డెంగ్యూ ఫీవర్ వస్తే తీవ్రమైన తలనొప్పి, హై-ఫీవర్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటివి వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మంచి రోగనిరోధక శక్తి, త్వరగా సరైన చికిత్స అందుకోవడం వల్ల ఈ డేంజర్ ఫీవర్ నుంచి తప్పించుకోవచ్చు.