Gym: అందంగా ఉండటంతో పాటు ఫిట్‌గా (Fit) ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దీని కోసం వ్యాయామం (Exercise) చేయడం లేదా జిమ్‌కి (Gym) వెళ్లడం వంటివి చేస్తుంటారు. వీటివల్ల ఎక్కువగా బరువు (Weight Gain) పెరగకుండా ఫిట్‌గా ఉంటారు. అయితే ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా బయట ఫుడ్ తినడం, దీంతో బరువు (Weight Gain) పెరిగిపోతున్నారు. ఆ తర్వాత జిమ్ ఎక్కువగా చేస్తుంటారు. రోజులో సగం సమయం జిమ్‌లోనే ఉంటున్నారు. ఎంత మసాలా ఫుడ్ తిన్నా కూడా దానికి తగ్గట్లు ఎక్కువ సమయం జిమ్‌లో ఉంటున్నారు. ఎక్కువగా జిమ్ చేయడం వల్ల యంగ్ లుక్‌లో ఉండటంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు. అయితే జిమ్‌కి వెళ్లకుండా ఫిట్‌గా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేయాలని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌కి వెళ్లడం వల్ల సమయం వృథా అవుతుంది. అదే ఇంట్లోనే కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఈజీగా ఫిట్‌గా తయారు కావచ్చు. మరి ఆ ఎక్సర్‌సైజ్‌లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
జంపింగ్ జాక్
ఇంట్లోనే జంపింగ్ జాక్ చేయడం వల్ల మీరు ఫిట్‌గా ఉంటారు. ఈ జంపింగ్ జాక్ వల్ల వెన్నెముక కూడా మెరుగుపడుతుంది. అలాగే కండరాలు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరివి అయితే కండరాలు బలహీనంగా ఉంటాయో వారు ఈ జంపింగ్ జాక్‌ను చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
పుష్-అప్స్
జిమ్‌కి వెళ్లి పుష్ అప్స్ చేసే బదులు ఇంట్లోనే చేయడం మంచిది. ఇంట్లో ఏదైనా ఎత్తైన ప్లేస్ ఉంటే అక్కడి నుంచి కూడా పుష్ అప్స్ తీసుకోవచ్చు. వీటివల్ల మీరు ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఫిట్‌గా కూడా ఉంటారు. కాబట్టి ఇంట్లోనే పుష్ అప్స్ చేయడం అలవాటు చేసుకోండి.
ప్లాంక్
ప్లాంక్‌ను ఇంట్లోనే చేస్తే చేతులు ఆరోగ్యంగా ఉంటాయి. దాదాపు ఒక 15 సెకన్ల పాటు ఇంట్లోనే ప్లాంక్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఈ వ్యాయామం వల్ల ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.
స్క్వాట్స్
హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్, క్వాడ్‌లు, స్క్వాట్స్ చేయడం వల్ల కీళ్ల సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకి కనీసం ఒక పది నిమిషాల పాటు అయిన కూడా వీటిని చేయడం వల్ల ఫిట్‌గా ఉంటారు.
వాల్-సర్ వర్కౌట్
క్వాడ్‌లు, హామ్ స్ట్రింగ్‌లు, గ్లూట్ వ్యాయామం చేయాలి. మీ ఇంట్లో ఉన్న గోడకు నిల్చోని మోకాళ్లలో ఉండాలి. ఇలా ఉండటం వల్ల కండరాలు బలంగా తయారు కావడంతో పాటు ఫిట్‌గా కూడా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.