Maha kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj) జరుగుతున్న ఈ మహా కుంభమేళాకి లక్షలాది భక్తులు వెళ్తుంటారు. పవిత్ర నదులు అయిన గంగా, యమునా, సరస్వతి మూడు నదుల సంగమంలో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో ఈ మహా కుంభమేళా (Maha kumbh Mela) జరుగుతుంది. అలహాబాద్ ప్రయాగ్‌రాజ్ (Prayagraj), హరిద్వార్ (Haridwar), ఉజ్జయిని (Ujjayini), నాసిక్‌లో(Nasik) జరుగుతుంది. వివిధ దేశాల నుంచి కూడా ఈ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి భక్తులు (Maha kumbh Mela) వెళ్తుంటారు. ఇందులో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అయితే మహా కుంభమేళాలో కేవలం భక్తులు మాత్రమే కాకుండా నాగ సాధువులు, అఘోరాలు కూడా భారీ సంఖ్యలో వెళ్తున్నారు. అయితే చాలా మందికి నాగ సాధువులకి, అఘోరాలకి తేడా తెలియదు. అసలు వీరిద్దరి మధ్య తేడా ఏంటి? వీరు ఏ దేవుడిని ఆరాధిస్తారు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నాగ సాదువులు, అఘోరాలు ఇద్దర కూడా శివుని భక్తులే. అయితే అఘోరాలు శివుడితో పాటు కాళీ దేవీని కూడా ఆరాధిస్తారు. అఘోరీలు ఎక్కువగా కాపాలిక సంప్రదాయాన్ని అనుసరిస్తారు. నాగ సాధువులు శివుని ఆరాధకులు, వారు శివలింగంపై బూడిద, నీరు, బిల్వ పత్రాలు సమర్పిస్తారు. వీరు ఎక్కువగా హిమాలయాలు, అడవులు, గుహలకు వెళ్లి తపస్సు చేస్తుంటారు. అఘోరాలు శివుడితో పాటు కాళీ దేవిని కూడా ఆరాధిస్తారు. వీరి పూజ నాగ సాధువుల మాదిరిగా కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది. అఘోరాలు మృతదేహం, శివుడు, దహన విధానం వంటి మూడు రకాల సాధనలను నిర్వహిస్తారు. మృత దేహ సాధనలో, మాంసాహారం, మద్యం సమర్పించి అఘోరీలను పూజిస్తారు. అలాగే శివసాధనలో మృత దేహంపై ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తుంటారు. వీరిద్దరి మధ్య కేవలం పూజా విధానంలో మాత్రమే కాస్త తేడాలు ఉంటాయి. వీరిద్దరూ కూడా శివుడిని భక్తితో పూజిస్తారు. ఎంతో పవిత్రంగా ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు పూజిస్తారు. పవిత్రంగా శివుడిని తపస్సు చేస్తుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.