https://oktelugu.com/

Gouthami Daughter: గౌతమి కూతురిని చూశారా?.. తల్లిని మించిన బీభత్సం.. వైరల్ పిక్స్

దక్షిణాది సినీ పరిశ్రమలో గౌతమికి ప్రత్యేక స్థానం ఉంది. 90వ దశకంలో ఉన్న స్టార్ హీరోయిన్లలో గౌతమి ఒకరు. తెలుగులో ఈమె ‘బామ్మ మాట బంగారు మూట’, చైతన్య, అన్నా, చిలక్కొట్టుడు, ద్రోహి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 30, 2024 / 04:00 PM IST

    Gouthami Daughter

    Follow us on

    Gouthami Daughter: సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రనాయకలుగా కొనసాగిన వారు తమ వారసురాళ్లను తీసుకొచ్చే పనుల్లో ఉన్నారు. కొన్నాళ్ల పాటు సౌత్ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన గౌతమి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం సినిమాల్లో నటించిన గౌతమ ప్రేక్షకులకు హాట్ ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో సైడ్ పాత్రల్లో కనిపించిన గౌతమి మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తాజాగా ఆమె కూతురు గౌతమి కంటే అందంగా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. అసలు విషయంలోకి వెళితే..

    దక్షిణాది సినీ పరిశ్రమలో గౌతమికి ప్రత్యేక స్థానం ఉంది. 90వ దశకంలో ఉన్న స్టార్ హీరోయిన్లలో గౌతమి ఒకరు. తెలుగులో ఈమె ‘బామ్మ మాట బంగారు మూట’, చైతన్య, అన్నా, చిలక్కొట్టుడు, ద్రోహి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం సినిమాల్లో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న గౌతమి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. కొన్నాళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న గౌతమి ఆ తరువాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి గుర్తింపు పొందారు.

    subbalaxmin bhatiya

    ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో బిజీగా ఉన్న సమంలోనే ప్రముఖ వ్యాపార వేత్త సందీప్ భాటియాను గౌతమి 1998లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు సుబ్బలక్ష్మీ అనే అమ్మాయి జన్మించింది. అయితే వీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. 1999 వీరికి మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మిని ఒంటరిగానే పెంచింది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది.

    కొన్నేళ్ల తరువాత గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మి ఫొటోలను బయటకు రిలీజ్ చేసింది. ఈ ఫొటోలను చూసి సినీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. గౌతమి కంటే అందంగా సుబ్బలక్ష్మి ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లోకి వస్తే కచ్చితంగా రాణిస్తారని కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బలక్ష్మి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.