https://oktelugu.com/

భారత ప్రజలకు శుభవార్త.. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందట..?

ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్ మళ్లీ వ్యాప్తి చెందితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ను అమలు చేయడం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు. పలు దేశాల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో రెండోసారి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2020 / 10:13 AM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్ మళ్లీ వ్యాప్తి చెందితే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ను అమలు చేయడం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు.

    పలు దేశాల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో రెండోసారి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. దీంతో కొందరు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదైతే మన దేశంలో కూడా లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సెరో సర్వేల ద్వారా చాలా మందిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని చాలామందిలో హెర్డ్ ఇమ్యూనిటీకి అవసరమైన దానికంటే ఎక్కువ యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

    మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగ్ పూర్, పుణేల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దీంతో పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని అందువల్లే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే పూర్తిస్థాయిలో వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెబుతున్నారు.

    కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్ భారత్ లో వచ్చే రెండు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.