కాంగ్రెస్ తో జగన్ పొత్తు.. ఊ కొడుతారా..? ఛీ కొడుతారా..?

రాజకీయాల్లో నేర్చుకోవాల్సిన నీతేంటంటే అధికారంలో ఉన్నప్పడు తలబిరుసు ఉండకపోవడం.. ఎందుకంటే ఊసరవెళ్లి లాగా రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మారుతాయో అర్థం కాదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు, రేపు అధికారంలోకి రావచ్చు. నేడు కుర్చీలో కూర్చున్న వాళ్లు రేపు ఇంట్లో ఖాళీగా కూర్చొనవచ్చు. అధికారంలో ఉన్నాం కదా.. అని  అడుగున ఉన్నవారిని ముప్పుతిప్పలు పెడితే సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ విషయంలోనూ ఇదే జరిగింది.. Also Read: పవన్ ను మరోసారి ఇరుకున పెట్టిన […]

Written By: NARESH, Updated On : November 22, 2020 11:00 am
Follow us on

రాజకీయాల్లో నేర్చుకోవాల్సిన నీతేంటంటే అధికారంలో ఉన్నప్పడు తలబిరుసు ఉండకపోవడం.. ఎందుకంటే ఊసరవెళ్లి లాగా రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మారుతాయో అర్థం కాదు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు, రేపు అధికారంలోకి రావచ్చు. నేడు కుర్చీలో కూర్చున్న వాళ్లు రేపు ఇంట్లో ఖాళీగా కూర్చొనవచ్చు. అధికారంలో ఉన్నాం కదా.. అని  అడుగున ఉన్నవారిని ముప్పుతిప్పలు పెడితే సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ విషయంలోనూ ఇదే జరిగింది..

Also Read: పవన్ ను మరోసారి ఇరుకున పెట్టిన బీజేపీ

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకని అందరికీ తెలుసు. ఆయన మరణం తరువాత జగన్ ఒంటరివాడైపోయాడు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ఫిల్లర్ గా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థతి కకావికలంగా మారింది. దీంతో జగన్ తననే ముఖ్యమంత్రిగా చేస్తారని భావించారు. కానీ అప్పటి కాంగ్రెస్ అధినేత్రి జగన్ ను పట్టించుకోలేదు. పైగా ఇతర నాయకుల చెప్పిన మాటలు విని ఆయనపై సీబీఐ దాడులు నిర్వహించి జైలుకు పంపించారు. ఎలాగోలా బయటపడ్డ జగన్ ప్రత్యేక పార్టీని స్థాపించి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే కాలం తారుమారై దేశీయ కాంగ్రెస్ పలు ఎన్నికల్లో ఓడిపోవడం ఆ తరువాత అధ్వాన స్థితికి చేరుకోవడం జరిగింది. ఇటీవల బీహార్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే  ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని తేలిపోయింది. దీంతో పార్టీలోని సీనియర్ నాయకులు కొత్త వ్యూహాన్ని రచించారు.  కాంగ్రెస్ ను వీడిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.  ఇందులో భాగంగా ఇప్పటికే శరద్ పవార్ నేతలతో భేటి అయ్యారు.  మమతా బెనర్జీతో కొందరు కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు.

Also Read: సామాన్యులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు..?

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జగన్ లాయర్లపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్ చేసింది కరెక్టే నంటూ కాంగ్రెస్ కు చెందిన నేతలు జగన్ కు మద్దతునిస్తున్నారు. అయితే తనకు ఎప్పటి నుంచో ప్రధాన శత్రువనుకుంటున్న కాంగ్రెస్ ను జగన్ ఆదరించే అవకాశం లేదని వైసీపీలోని నాయకులు పేర్కొంటున్నారు.

కాగా జగన్ ఇప్పటికే బీజేపీతో సాన్నిహిత్యాన్ని పాటిస్తూ వస్తన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ తో చేతులు కలిపితే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. అవసరమైతే మూడో ఫ్రంట్ వైపు జగన్ చూస్తాడు కానీ.. కాంగ్రెస్ మాత్రం పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్