https://oktelugu.com/

పవన్ ను మరోసారి ఇరుకున పెట్టిన బీజేపీ

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఏం చేద్దాం.. ఏం చేద్దాం.. అని ఆలోచించుకుంటూనే పవన్ కల్యాణ్ పప్పులో కాలేస్తున్నాడు. జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అవస్థలు పడుతున్న పవన్ కు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కొందరు మాత్రమే రాణించారు. తమ జీవితంలో కూడా అదే జరుగుద్దనుకున్న పవన్ కు అన్నీ రివర్స్ గానే మారుతున్నాయి. Also Read: భారతీయుల అమెరికా వ్యామోహం తీరిపోయిందా? […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 10:01 AM IST
    Follow us on

    ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఏం చేద్దాం.. ఏం చేద్దాం.. అని ఆలోచించుకుంటూనే పవన్ కల్యాణ్ పప్పులో కాలేస్తున్నాడు. జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అవస్థలు పడుతున్న పవన్ కు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కొందరు మాత్రమే రాణించారు. తమ జీవితంలో కూడా అదే జరుగుద్దనుకున్న పవన్ కు అన్నీ రివర్స్ గానే మారుతున్నాయి.

    Also Read: భారతీయుల అమెరికా వ్యామోహం తీరిపోయిందా?

    తెలుగు రాష్ట్రాలకు సుపరిచిత వ్యక్తి అయిన పవన్ తన ఇమేజ్ తో రాజకీయాల్లోకి రాణించాలనుకున్నాడు. కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు ఉన్న ఇమేజ్ డ్యామేజ్ గా మారుతున్నాయి. ఇటీవల దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపొందిన తరువాత పవన్ తెలంగాణ బీజేపీ నాయకులను ప్రత్యేకించి పొగడ్తలు చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో బీజేపీతో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

    ఆ తరువాత బీజేపీ సైడ్ ఇవ్వకపోడంతో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. దీంతో నామినేషన్ పత్రాలు పట్టుకొని సిద్ధంగా ఉన్న జనసైనికులు, పవన్ బీజేపీ నాయకులతో భేటీ తరువాత తీవ్ర నిరాశ చెందారు. జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయడం లేదని ప్రకటించడంతో కొందరు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. దీంతో తెలంగాణలో జనసేన పరిస్థితి అందరికీ అర్థమైపోయింది.

    ఇక ఆంధ్రలో పార్టీ పెట్టిన ప్రారంభంలో తాను చెగువేరా అని పవన్ చెప్పుకున్నాడు. పవన్ భావాలను చూసి కమ్యూనిస్టులు ఆయనకు దగ్గరయ్యారు. గత ఎన్నికల్లో ఆయనతో కలిసి పోటీ చేశారు. కాగా పవన్ తో సహా కమ్యూనిస్టులు కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయినా పవన్ అందరివాడు అనే భావన ఉండేది. కొన్ని రోజుల తరువాత బీజేపీకి వంత పాడడంతో కమ్యూనిస్టులు దూరమయ్యారు. అయితే బీజేపీ మాత్రం జనసేనతో అంటీముట్టనట్టుగానే ప్రవర్తిస్తోంది.

    Also Read: గ్రేటర్‌‌ హైదరాబాద్‌.. గ్రేట్‌ హిస్టరీ..

    అయినా ఇటీవల అమరావతిలో పర్యటించిన పవన్ కేంద్రం అమరావతి రైతులకు న్యాయం చేస్తుందన్నట్లు మాట్లాడారు. దీంతో బీజేపీ, జనసేన మధ్య సాన్నిహిత్యం ఇంకా కొనసాగుందనే అందరూ భావించారు. అయితే విశాఖ జిల్లాలోని ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన భూములను ఫోక్సో అనే సంస్థకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం ఒప్పందం చేసుకుంది. మరోవైపు కార్మికులను వీఆర్ఎస్ పేరుతో తొలగిస్తున్నారని పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో కొందరు ఆందోళన చేస్తున్నారు.

    గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలోనే విశాఖ స్టీల్ ప్లాంటు ఉంది. దీంతో ఇప్పుడు ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు..’అనే ఉద్యమం తరహాలో పవన్ పోరాటం చేస్తారా.. లేకుంటే మనకెందుకులే అనుకుంటారా..? అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ ఎలాగూ పట్టించుకోదు. మరి బీజేపీతో పొత్తు ఉన్న పవన్ కార్మికుల పక్షాన నిలబడుతాడా..? లేదా..? అనేది చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్