GBS Cases In Pune: కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం అతలా కుతలమైంది. ఈ వైరస్ ప్రభావం అన్నిరంగాలపై పడింది. ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి. విద్యా వ్యవస్థ బలహీనపడింది. ఆర్థిక మాంద్యంతో ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు స్వస్థి పలుకుతున్నాయి. వర్క్ ఫ్రం హోం విధానం అందుబాటులోకి వచ్చింది. ఇక వైరస్ బారిన పడి లక్షల మంది మృతి చెందారు. ఈవిషాదం నుంచి ఇప్పుడిప్పుడే దేశంతోపాటు ప్రపంచం కోలుకుంటోంది. ఇలాంతి తరుణంలో మహారాష్ట్రలో కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. గులియన్–బారే సిండ్రోమ్(GBS) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పూణెలో తొలి మరణం కూడా సంభవించింది. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. పూణె కేంద్రంగా వ్యాప్తి చెందుతున్న గులియన్ బారే సిండ్రోమ్ బ్యాక్టీరియా కారణంగా తొలి మరణం(First death) సంభవించినట్లు తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక జీబీఎస్ వ్యాధి లక్షణాలతో జనవరి 9న ఆస్పత్రిలో చేరిన ఓ రోగి పూణె క్లస్టర్‌లో చికిత్స పొందుతూ మరనించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జీబీఎస్ కేసుల సంఖ్య 101కు పెరిగింది. 28 మందికి ఇన్‌ఫెక్షన్ ధ్రువీకరించారు. 16 మంది వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్నారు.
అన్ని వయసులవారు..
జీబీఎస్ వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో 19 మంది రోగులు 9 ఏళ్లకన్నా తక్కువ వయసువారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 50 నుంచి 80 ఏళ్ల వయసువారు 23 మంది ఉన్నారని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రోగుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించగా, అందులో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టిరియా ఉన్నట్లు వెల్లడైంది. జీబీఎస్ ప్రపంచంలో మూడోవంతు మరణాలకు కారణమవుతుంది. అది అత్యంత తీవ్రమైన అంటు వ్యాధులలో ఒకటి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరిస్తోంది. పూణె(Pune)లోని ప్రధాన నీటి నిల్వ ప్రాంతమైన ఖడక్వాస్లా డ్యామ్ సమీపంలోని ఓ బావిలో ఈ కోలి అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు శనివారం విడుదలైన ల్యాబ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించాయి. అయితే ఆ బావిని అసలు వినియోగిస్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తాగు నీటితోనే..
తాగునీటితోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో పూణె ప్రజలు బాగా మరిగించి చల్లార్చిన నీటినే తాగాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఆహారం కూడా బాగా ఉడికించి తినాలంటోంది. ఆదివారం నాటికి 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు అధికారులు తెలిపారు. జీబీఎస్ చికిత్స చాలా ఖరీదైదని. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.20 వేలు ఉంటుంది. ఈ బ్యాక్టీరియా శరీర రోగ నిరోధక వ్యవస్థను గుళ్ల చేసి ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. మెదడు సంకేతాలను శరీరంలోని వివిధ విభాగాలకు తీసుకెళ్లే నరాలపై దాడి చేస్తుంది. బలహీనపరుస్తుంది. దీంతో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. బాధిత రోగులలో 80 శాతం మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 6 నెలలోపు కోరుకుని నడవగల సామర్థం పొందుతారని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే కొందరికి మాత్రం పూర్తిగా కోలుకోవడానికి ఏడాది కూడా పట్టే వకాశం ఉందంటున్నారు.
చికిత్స ఉచితంగా..
జీబీఎస్ వ్యాధి సోకిన రోగులకు ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ల కోర్సు అవసరం అవుతుంది. పూణెలోని మూడు ప్రధాన ఆస్పత్రుల్లో జనవరి 10 నాటికి 26 కేసులు ఉండగా, జనవరి 24 వరకు వాటి సంఖ్య 73కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చికిత్స ఖరీదైదని కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించిన అనంతరం ఈ వ్యాధిసోకినవారికి ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.