Good News for DWCRA Women
DWCRA Loans : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని వర్తింపజేస్తోంది. పీఎం సూర్య ఘర్ యోజన కింద డ్వాక్రా మహిళలకు ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు సామర్థ్యాన్ని బట్టి వారికి రాయితీ అందించేందుకు సిద్ధపడుతోంది. పేద ప్రజలపై విద్యుత్ భారం తగ్గించే దిశగా ఈ చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి సోలార్ వెలుగులను అందించాలని చూస్తోంది. సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎస్సీలు, ఎస్ టి లకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీలు అందిస్తోంది. ఇప్పుడు డ్వాక్రా సంఘాలకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకుంది.
* కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు
రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. విడతల వారీగా డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ లను అమర్చాలని ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా తొలి దశలో లక్ష మంది ఇళ్లపై అమర్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సెర్ఫ్ అధికారులు సోలార్ ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే మహిళల పేర్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో.. సోలార్ ద్వారా కొంత భారం తగ్గే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ ను సైతం సంస్థలు కొనుగోలు చేసి పరిస్థితి కనిపిస్తుండడంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.
* 80 వేల మంది అంగీకారం
రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది వరకు ఈ పథకం ఉపయోగించేందుకు తమ అంగీకారం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 మంది సోలార్ రూప్ టాప్ లను పెట్టేందుకు ముందుకు వచ్చారు. అయితే అందులో 400 మంది డ్వాక్రా మహిళలే ఉండడం విశేషం. అందుకే డ్వాక్రా మహిళలను ఒప్పించి సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యగ్రహ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా మూడు రకాల కెపాసిటీతో సోలార్ రూఫ్ ఏర్పాటు చేసేందుకు రాయితీ అందిస్తున్నారు.
* ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది.
* రెండు కిలో వాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ. 1.40 లక్షలు కాగా.. రాయితీ రూ.60000 ఉంటుంది.
* మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్ టాప్ ఏర్పాటు కోసం వ్యయం రూ. 1.95 లక్షలు కాగా.. రాయితీ రూ. 78 వేలు వస్తుంది.
* నేరుగా రుణం
పీఎం సూర్యగ్రహ యోజన పథకం కింద లబ్ధిదారుడు 10% వాటా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని ఏడు శాతం వడ్డీ పై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, శ్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap government provide rs 10 lakh loan to dwcra women under zero interest sfurti scheme
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com