గ్యాస్ కుకింగ్ తో పిల్లలకు ఆ సమస్యలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?

దేశంలో వంట గ్యాస్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ధరలు పెరుగుతున్నా చాలామంది వంట గ్యాస్ ద్వారా తక్కువ సమయంలో వంట చేసే అవకాశం ఉండటంతో గ్యాస్ వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. గ్యాస్ పై వంట చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అందరూ భావిస్తారు. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తే కట్టెల నుంచి వచ్చే పొగ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వెల్లడైంది. Also Read: మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి కారణం ఇదే..? […]

Written By: Navya, Updated On : December 19, 2020 12:24 pm
Follow us on


దేశంలో వంట గ్యాస్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ధరలు పెరుగుతున్నా చాలామంది వంట గ్యాస్ ద్వారా తక్కువ సమయంలో వంట చేసే అవకాశం ఉండటంతో గ్యాస్ వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. గ్యాస్ పై వంట చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అందరూ భావిస్తారు. గతంలో కట్టెల పొయ్యిపై వంట చేస్తే కట్టెల నుంచి వచ్చే పొగ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వెల్లడైంది.

Also Read: మహిళలకు తక్కువగా కరోనా సోకడానికి కారణం ఇదే..?

తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో గ్యాస్ పై వంట చేసినా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని తేలింది. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తగినంత వెంటిలేషన్ లేని కిచెన్ గదుల్లో గ్యాస్ తో వంట చేస్తే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు వంట గ్యాస్ పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు.

Also Read: ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు ఉంచుతున్నారా.. చేయకూడని తప్పులివే..?

గ్యాస్ స్టవ్ ఉన్న గదుల పిల్లల్లో గ్యాస్ స్టవ్ లేని గదుల్లో ఉన్న పిల్లల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఆస్తమా వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సైతం గ్యాస్ కుకింగ్ గురించి పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. గ్యాస్ స్టవ్ ఉండే గదికి పిల్లలను దూరంగా ఉంచితే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే గ్యాస్ కుకింగ్ వల్ల నడి వయస్సు వారిపై, పెద్దవారిపై ఎటువంటి ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

గ్యాస్ ను వినియోగించే సమయంలో కొన్ని వాయువులు ఉత్పత్తి అవుతాయని కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై యాక్సైడ్ గ్యాస్ సిలిండర్ ను వినియోగించే సమయంలో విడుదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే మీ పిల్లలు ఆస్తమా సమస్యతో బాధ పడుతూ ఉంటే గ్యాస్ కుకింగ్ ఆ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.