
గడిచిన 24 గంటల్లో ఏపీ కొత్తగా 458 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయి కేసులతో కలిపి రాష్ట్రంలో 8,77,806కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో గుంటూరులో మాత్రమే ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,070 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 4,377 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 8,66,359 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.