https://oktelugu.com/

కరణ్ జోహార్ మెడకు డ్రగ్స్ కేసు… ఆ స్టార్స్ గుండెల్లో రైళ్లు!

బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు వదిలేలా లేదు. సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరో బాలీవుడ్ సెలబ్రిటీని విచారణకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణకు పిలిచారు. బాలీవుడ్ బిగ్ షాట్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. తన నివాసంలో జరిగిన ఓ పార్టీకి సంబంధించిన వీడియోపై తాను వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. దీనితో మరొకమారు బాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో బాంబు పేలినట్లు అయ్యింది. గతంలో తన నివాసంలో […]

Written By:
  • admin
  • , Updated On : December 18, 2020 / 06:08 PM IST
    Follow us on


    బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు వదిలేలా లేదు. సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరో బాలీవుడ్ సెలబ్రిటీని విచారణకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణకు పిలిచారు. బాలీవుడ్ బిగ్ షాట్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. తన నివాసంలో జరిగిన ఓ పార్టీకి సంబంధించిన వీడియోపై తాను వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. దీనితో మరొకమారు బాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో బాంబు పేలినట్లు అయ్యింది. గతంలో తన నివాసంలో కరణ్ జోహార్ ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో బాలీవుడ్ కి చెందిన కొందరు బిగ్ స్టార్స్ పాల్గొన్నారు.

    Also Read: వెయ్యి కోసం కేఫ్ లో పనిచేశా… బాబాయ్ జపాన్ పిల్ల అనేవాడు

    దీపికా పదుకొనె, రన్బీర్ కపూర్, షాహిద్ కపూర్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ లతో పాటు మరికొందరు ప్రముఖ తారలు ఈ పార్టీకి హాజరు కావడం జరిగింది. ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియో ఆమధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరణ్ బాలీవుడ్ సెలెబ్రెటీలకు తన ఇంటిలో డ్రగ్స్ పార్టీ ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. డ్రగ్స్ కేసు విచారణ సీరియస్ గా సాగుతున్న సమయంలో ఈ వీడియో బయటికి రావడం సంచలనంగా మారింది. ఆ వీడియోలో ఉన్న స్టార్స్ తీరు సైతం డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కనిపించడం, అనుమానాలను మరింత బలపరిచింది.

    Also Read: అసలు రంగు బయటపెట్టిన పవన్ భార్య

    కాగా ఈ వీడియోపై కరణ్ తన వివరణ ఇవ్వాలని, అధికారుల విచారణలో పాల్గొనాలని అతనికి నోటీసులు పంపారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కరణ్ పై ఎంతో కోపంగా ఉన్న నెటిజెన్స్ అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కాఫీ విత్ ఎన్సీబీ అంటూ సెటైర్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సుశాంత్ ఆత్మహత్య కేసుతో మొదలైన విచారణ డ్రగ్స్ వైపు మళ్లింది. డ్రగ్స్ కొనుగోళ్ళకు పాల్పడ్డారని రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ లను అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్ కేసులో అనుమానితులుగా దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ మరియు సారా అలీ ఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. కరణ్ జోహార్ విచారణతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్