https://oktelugu.com/

Foods : చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..

అంతేకాదు ఈ పాలకూరతో పాటు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటివి తీసుకోవాలి. వీటి వల్ల కూడా చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. తగిన పోషకాలు అందుతాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 28, 2024 / 10:45 PM IST
    Follow us on

    Foods : ఈ సీజన్ ను వ్యాధుల కాలం అనడం బెటరా? చలికాలం అనడం బెటరా? అవునండీ మరీ.. చలికాలం వచ్చిందంటే చాలు ఫుల్ జబులు, దగ్గు మొదలై జ్వరం అంటూ వేధిస్తుంటాయి. ఈ సమయంలో ఏదో ఒక జబ్బు బారిన పడుతారు. . ఈ సమయంలో రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. చలి కాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తాయి. అందుకే ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల మీరు త్వరగా అలసిపోరు. నీరసంగా ఉండరు. అంతేకాదు ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. మినరల్స్, విటమిన్స్, ఫైబర్, ఖనిజాలు ఉండే ఫుడ్ ను ఎక్కువ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ సమయంలో త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. మీ జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. మరి జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ సమయంలో తీసుకోవాల్సిన్ ఫుడ్ ఏంటో ఓ సారి చూసేద్దాం.

    మెంతి కూర: ఈ సమయంలో మెంతి కూర ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మెంతికూర చలికాలంలో ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీకు మంచి పోషకాలు అందుతాయి అంటున్నారు నిపుణులు. ఈ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఏ విధంగా తీసుకున్నా సరే కానీ మెంతిని మాత్రం మీ ఆహారంలో చేర్చుకోండి.

    పచ్చి బఠాణీలు: పచ్చి బఠాణీల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ శాతం ప్రోటీన్, ఫైబర్ లు కూడా ఉంటాయి. కూరగాయలు, ఇతర ఆహారలతో చేర్చుకున్నా సరే. లేదంటే స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. సలాడ్స్‌లో కలిపి తీసుకుంటే కూడా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఇక ఈ పచ్చి బఠాణీలు రెండు రకాలు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు ఉన్నవి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు.

    బీట్ రూట్ – క్యారెట్స్: చలి కాలంలో బీట్ రూట్, క్యారెట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బీట్ రూట్‌, క్యారెట్స్‌లో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి శరీరంలోని మలినాలను తొలగించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇమ్యూనిటీని బలపరుస్తాయి ఈ కూరగాయలు. అంటే మీరు త్వరగా రోగాల బారిన పడరు అన్నమాట.

    పాలకూర: ఈ సీజన్ లో ఎక్కువగా తీసుకోవాల్సిన కూరగాయల్లో పాలకూర ఒకటి అంటున్నారు నిపుణులు. పాలకూరలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. కాబట్టి పాలకూర తగిన మోతాదులో తీసుకోండి. అంతేకాదు ఈ పాలకూరతో పాటు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటివి తీసుకోవాలి. వీటి వల్ల కూడా చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. తగిన పోషకాలు అందుతాయి.