https://oktelugu.com/

water : చలి కాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఏదో ఎక్కువ సార్లు మూత్రం వస్తుందని భయపడి నీరు తాగకుండా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చలికాలంలో వాటర్‌ను అసలు లైట్ తీసుకోవద్దు. ఏ సీజన్‌లో అయిన బాడీకి సరిపడే వాటర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2024 / 11:59 PM IST
    Follow us on

    water  : నీరు అనేది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవికి ముఖ్యమే. నీరు లేకపోతే మనిషి అసలు జీవించలేడు. డైలీ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అయితే చాలా మంది దాహం వేసినప్పుడు నీరు తాగుతుంటారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని తాగుతుంటారు. అయితే సాధారణంగా నీరు వేసవిలో ఎక్కువగా తాగుతుంటారు. చలికాలంలో నీళ్లను చాలా తక్కువగా తాగుతుంటారు. నిజం చెప్పాలంటే ఈ కాలంలో అసలు నీళ్లు తాగాలనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే ఎక్కువగా వాటర్ తాగితే యూరిన్ వస్తుంది. ఈ చలికి పదే పదే వెళ్లడానికి కొందరికి బద్ధకంగా ఉంటుంది. దీంతో చాలా తక్కువగా నీరు తాగుతారు. దీంతో అనారోగ్య సమస్యలు అన్ని వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చలికాలంలో తక్కువగా నీరు తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.

    చలికాలంలో తక్కువగా నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లు అందవు. దీంతో కండరాలు బలహీనం అయిపోతాయి. అలాగే నొప్పి, తిమ్మిరి వంటివి రావడంతో పాటు ఎముకలు బలహీనం అయిపోతాయి. దీంతో బోలు ఎముకల వ్యాధి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీటితో పాటు తలనొప్పి, గుండె సమస్య, అజీర్ణం, ప్రోస్టేట్ సమస్యలు, కీళ్లు నొప్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో నీరు శరీరానికి అందకపోతే బాడీ నీరసంగా తయారవుతుంది. చలికి బాడీ కూడా తట్టుకోలేదు. దీంతో మీరు అనారోగ్య సమస్య బారిన పడతారు. ముఖ్యంగా రక్తనాళాలు ఎక్కువగా సంకోచం చెందుతాయి. అలాగే నీరు తక్కువ కావడం వల్ల కండరాలు తిమ్మిరి ఎక్కుతాయి. అలాగే చేతులు, కాళ్లు వాపుకు గురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    చలికాలంలో పూర్తిగా నీరు తాగకపోవడం వల్ల కీళ్లు బలహీనంగా మారుతాయి. దీంతో మోకాల నొప్పులు వస్తాయి. సాధారణంగా చలికాలంలో ఎక్కువగా చలి ఉంటుంది. ఈ చలిని తట్టుకోవాలంటే బాడీకి పోషకాలు ఎక్కువగా అందాలి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలిని తట్టుకోవడంతో పాటు ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తట్టుకోవాలంటే తప్పకుండా వాటర్ ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగానే ఈ కాలంలో దాహం వేయదు. ఇలా దాహం వేయకపోయిన కూడా వాటర్ ఎక్కువగా తాగాలి. ఏదో ఎక్కువ సార్లు మూత్రం వస్తుందని భయపడి నీరు తాగకుండా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చలికాలంలో వాటర్‌ను అసలు లైట్ తీసుకోవద్దు. ఏ సీజన్‌లో అయిన బాడీకి సరిపడే వాటర్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.