https://oktelugu.com/

Team India cricketer : ఆడింది ఆరు మ్యాచ్ లే.. అంతలోనే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. ఎమోషనల్ వీడియో రిలీజ్..

అతడు ఆడింది ఆరు మ్యాచ్ లు మాత్రమే.. ఏం జరిగిందో తెలియదు కానీ.. అతడు తన కెరియర్ కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దీనికి సంబంధించి ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశాడు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 28, 2024 / 09:44 PM IST

    Team India cricketer Siddharth Kaul

    Follow us on

    Team India cricketer : సిద్ధార్థ్ కౌల్.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇతడు టీమిండియా తరఫున 3 వన్డేలు, 3 t20 లు ఆడాడు.. 3 t20 లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఏకంగా 88 మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించాడు. 297 వికెట్లు నేలకూల్చాడు. సిద్ధార్థ్ ఐపీఎల్ లోనూ మెరిశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులోకి బౌలర్ గా 2008లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో బౌలర్ గా కొనసాగాడు. 2013 నుంచి 2014 వరకు ఆ జట్టులో ఉన్నాడు. 2016 నుంచి 2021 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కీలక బౌలర్ గా సేవలందించాడు. ఆ తర్వాత బెంగళూరు జట్టులోకి వెళ్లిపోయాడు. ఆ జట్టుకు కీలక బౌలర్ గా సేవలందించాడు.. 2022 నుంచి మొన్నటి వరకు ఆ జట్టులో కొనసాగాడు ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్ కు రిటర్మెంట్ ప్రకటించాడు. దీనికి సంబంధించి ఒక భావోద్వేగ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

    ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు

    ఐపీఎల్ లో సిద్ధార్థ్ కౌల్ 55 మ్యాచ్ లు ఆడాడు. 58 వికెట్లు పడగొట్టాడు. 8.63 ఎకానమీ నమోదు చేశాడు. 30.0 యావరేజ్ కొనసాగించాడు. ఇంగ్లాండ్ జట్టుతో 2018 జూలై 12న జరిగిన మ్యాచ్లో తొలి వన్డే ఆడాడు.. 2021 సెప్టెంబర్ 25న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా చివరి వన్డే ఆడాడు. 2018 జూన్ 29న ఐర్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్లో తొలి మ్యాచ్ ఆడాడు. 2019 ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడాడు. సిద్ధార్థ్ సొంత రాష్ట్రం పంజాబ్. ఇతడు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడు. 2007లో పంజాబ్ జట్టు తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 2008 అండర్ 19 ప్రపంచ కప్ ను భారత్ సాధించింది. ఆ జట్టులో ఇతడు కీలక ఆటగాడు. అందులో చూపించిన ప్రదర్శన ఆధారంగా కోల్ కతా జట్టు యాజమాన్యం ఇతడికి ఐపీఎల్ లో అవకాశం కల్పించింది.. అయితే అతడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పటికీ.. ఇటీవలి ఐపిఎల్ మెగా వేలంలో అతడిని బెంగళూరు జట్టు కొనుగోలు చేయలేదు. మిగతా జట్లు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. బేస్ ప్రైస్ తగ్గించుకున్నప్పటికీ ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో అతడు నిరాశతో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.