వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కోడికత్తి కేసు ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై జరిపిన హత్నాయత్నం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది.. విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సంచలనమైన సంఘటన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో జరిగిన ఘటన అది. ఆ హత్యాయత్నానికి ఇప్పుడు విశాఖ లో జరిగిన ఓ ఘటనకు లింకుంది.
Also Read: చంద్రబాబు బేజారు.. జగన్ ఇంత రాటుదేలాడా?
కోడికత్తి కేసులో జగన్ పై కత్తితో దాడిచేసిన ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును విచారించిన ఎన్ఐఏ స్టేట్ మెంట్లను 2018లో రికార్డు చేసింది. శ్రీనివాసరావు పనిచేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరిని కూడా విచారణకు రావాలని ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన విచారణకు రాలేదు. టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే ఆయన పరారీలో ఉన్నాడని.. దేశం దాటేశాడనే వాదనలు నాడు వచ్చాయి.
జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు… ఈయన పనిచేస్తున్న రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి కీలకమన్న ఆరోపణలున్నాయి. దాడి చేసిన శ్రీనివాస్ కు ఆశ్రయం కల్పించింది హర్షవర్ధనే అన్న ఆరోపణలు వచ్చాయి..ఈ నేపథ్యంలోనే హర్షవర్ధన్ ను ఎన్ఐఏ విచారిస్తే కీలక విషయాలు బయటపడుతాయి. కానీ ఆయన పారిపోయాడు.
ఆ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూస్తాయి. విశాఖ నగరం నడిబొడ్డున సిరిపురం అనే జంక్షన్ ఉంది. ఆ జంక్షన్లో చాలకాలంగా ఓ ఫేమస్ రెస్టారెంట్ ఉంది. అదే ఫ్యూజన్ రెస్టారెంట్. ఈ ఫ్యూజన్ రెస్టారెంట్ భవనాన్ని విశాఖ నగర పాలక సంస్థ అధికారులు హుటహుటిన ఖాళీ చేయించారు. ఈ రెస్టారెంట్ స్థలం చాలా కాలంగా ఆ హోటల్ యజమాని చేతుల్లోనే ఉంది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?
ఇన్నేళ్లుగా ఇది అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుందట. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్ల వరకు మాత్రమే లీజు కొనసాగాలి. కానీ దశాబ్దకాలంగా అది ఆ యజమాని చేతితోనే ఉంది. 2015 నుంచి 2024 వరకు అనుమతులు ఇస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే మూడేళ్ల పాటు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనసాగించాలంటే వేలం పాట వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
కానీ, ఈ నిబంధనలు పాటించకుండానే 9 ఏళ్ల పాటు అనుమతులు పొంది ఫ్యూజన్ ఫుడ్స్ కొనసాగుతోందన్న ఫిర్యాదు అధికారులకు అందింది. దీంతో ఈ రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్నట్లు వీఎంఆర్‌డీఏ అధికారులు చెప్పారు. సామాగ్రిని యజమానికి అప్పగించి ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు అతి సన్నిహితుడిగా పేరొందిన హర్షవర్ధన్ ఈ ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ నిర్వాహకుడు. సిరిపురం జంక్షన్ వద్ద ఉడా నుంచి లీజుకు తీసుకున్న ఆస్తిని టీడీపీ నేత హర్ష రెండింతల అద్దెకు మరొకరికి ఇచ్చాడు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఇక హర్షవర్దన్ కు జగన్ పై జరిగిన హత్యాయత్యానికి ఏంటి సంబంధం అన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా. జగన్ పై హత్యాయత్నం జరిగినప్పడు పథక రచన జరిగింది ఈ హర్షవర్దన్ హోటల్ లోనేననే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.. అదే ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ లో జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి అసిస్టెంట్ చెఫ్ గా పనిచేశాడు.. ఇది కథ. ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్ యాజమని చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు హయాంలో సిట్ అధికారులు హర్షవర్దన్ ను విచారించారు. కానీ ఎటువంటి కేసు నమోదు చేయాలేదు. ఇప్పుడు హర్షవర్దన్ అక్రమానికి చెక్ పడింది. ఆయనకు చంద్రబాబు ఇచ్చిన అక్రమ ఆస్తిని జగన్ సర్కార్ వెనక్కి తీసుకుంది.