Polala Amavasya 2024: శ్రావణ మాసంలో వచ్చే చివరి అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఎడ్ల అమావాస్య అని ఎద్దులకు పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది పోలాల అమావాస్య తిథి రెండు రోజుల పాటు ఉండనుంది అంటున్నారు పండితులు. అయితే అమావాస్య సోమవారం అయితే దీని ప్రభావం మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఉంటుందట. అందుకే సూర్యోదయం ఉదయం 5:45 గంటలకు వస్తుంది. అందుకే మంగళవారం ఉదయకాలిక తిథిలో అమావాస్య రావడంతో రెండు రోజుల పాటు అమావాస్య ఉండనుంది.
జన్మరాశిలో చంద్రుడు ఏ విధంగానైనా పాపంతో బాధపడుతుంటే జాతకంలో విష యోగం ఏర్పడుతుందట. ఇలాంటి సమస్య ఉంటే ఈ రోజున శివుడిని ఆరాధించడం వల్ల విష యోగం వంటి చెడు యోగాల నుండి విముక్తి పొందవచ్చు అంటున్నారు పండితులు. అంతేకాదు మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఇలా చేయడం వల్ల చంద్రుని శుభ ప్రభావం వల్ల మానసిక స్థిరత్వం కూడా మీ మీద ఉంటుంది. అయితే ఈ రోజు స్నానం, దానధర్మాలు ఫలమిస్తాయని సమాచారం. ఈ సారి పొలాల అమావాస్య సోమవారం కూడా వచ్చింది కాబట్టి కొన్ని ప్రాంతాల వాళ్ళు సోమవతి అమావాస్య అంటున్నారు. అయితే ఈ రోజున రాశుల ప్రకారం ఎలాంటి దానాలు చేయాలో చూసేద్దాం.
మేషం :- పచ్చి శెనగలు, శనగలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి..
వృషభం :- శివుడికి శనగపప్పు, ఆవు పాలు సమర్పించడం వల్ల అనుకున్నవి జరుగుతాయట.
మిథునం :- శివునికి ఎర్రని పప్పు, చందనం ప్రసాదంగా పెట్టండి.
కర్కాటకం: శమీ పత్రాన్ని శివునికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
సింహం : నల్ల నువ్వులను దానం చేయాలి. అంతేకాకుండా శివునికి పాలు సమర్పించడం వల్ల ఫలితాలు ఉంటాయి.
కన్య:- ఎర్రని పప్పు దానం చేసి శివునికి నైవేద్యంగా పెట్టాలి. గంగాజలంలో ఎర్రచందనం కలిపి స్నానం చేయడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి.
తులా రాశి :- శివుడికి శనగపప్పు, పసుపు వస్త్రాలు సమర్పించి ఆ పరమేశ్వరుని ధ్యానం చేయండి.
వృశ్చిక రాశి :- గోదానము చేసి శివునికి నువ్వులు సమర్పించుకుంటే సరిపోతుంది.
ధనుస్సు :- శివునికి బియ్యం, పంచదార, పాలు సమర్పించడం వల్ల విశేష ప్రయోజనాలు ఉంటాయి. అన్నం దానం మరీ మంచిది.
మకరం: శివునికి పసుపు వస్త్రాలు, పసుపు పుష్పాలను సమర్పించండి.
కుంభం :- శివునికి అన్నంతో అభిషేకం చేసి పాలు నైవేద్యంగా పెట్టండి.
మీన రాశి :– శివునికి సెంటు నైవేద్యము, గోధుమలను దానంగా పెట్టండి. అనుకున్న ఫలితాలు పొందుతారు.
పొలాల అమావాస్య ప్రాముఖ్యత
అమావాస్య తిథి మంగళవారం వస్తుంది. కాబట్టి ఈ రోజున శివుని రుద్ర అవతారమైన హనుమాన్ మహారాజ్‌ను పూజించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆనందం పెరుగుతుంది. ఈ రోజున కూడా గంగాస్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ రోజున పూర్వీకుల పేరిట దానం చేయాలి. శివుడిని పూజించాలి. ఇలా చేస్తే ఎవరైనా సరే రుణ విముక్తిని పొందుతారని అంటున్నారు పండితులు.