మన దేశంలోని మసాలా దినుసులు ఎన్నో అద్భుతమైన గుణాలను కలిగి ఉన్నాయి. మసాలా దినుసులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మసాలా దినుసుల్లో ఒకటైన మెంతులను వంటల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. ఊరగాయలు, చారు, పులుసు, పోపుల్లో ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటాం. మెంతులలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.
Also Read: కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారా.. ఆ అవయవానికి డేంజర్..?
మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగినా లేదా మెంతులను పొడి చేసి తీసుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బి, సి విటమిన్లు, కాల్షియం, ఐరన్ మెంతుల ద్వారా లభిస్తాయి. పూర్వీకులు వంటల్లో మెంతులను ఎక్కువగా వినియోగించేవారు. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు మెంతులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. మెంతులు నానబెట్టిన నీళ్లు రోజూ తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు.
Also Read: గురక సమస్య వేధిస్తోందా.. ఆ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?
మెంతులను నానబెట్టి తలకు పట్టిస్తే జుట్టు సంబంధిత సమస్యలు రావు. జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు జుట్టు రంగు మారకుండా ఉంటుంది. మెంతులు కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తాయి. రోజూ మెంతులు తీసుకునే వారిలో కండరాల నొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో మెంతులు సహాయపడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
మెంతులు జీర్ణసంబంధిత సమస్యలకు సైతం సులభంగా చెక్ పెట్టడంలో సహాయపడతాయి. మెంతులు విరేచనాల సమస్యను సైతం తగ్గించడంలో సహాయపడతాయి. స్థులకాయులు ప్రతిరోజూ మెంతులు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.