కరోనా మహమ్మారి విజృంభణ వల్ల యాంటీ బయోటిక్స్ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. దగ్గు, జలుబు, తలనొప్పి లాంటి చిన్నచిన్న సమస్యలకు సైతం మందులు వాడే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. అతిగా మందులు వాడటం వల్ల తాత్కాలికంగా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించినా ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అతిగా యాంటీ బయోటిక్స్ వినియోగిస్తే సూపర్ గనేరియా అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
Also Read: మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
సూపర్ గనేరియా వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థ విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ ను వినియోగించకూడదని ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడకూడదని తెలిపింది. కరోనా మహమ్మారి బారిన పడ్డవాళ్లు సైతం ఎక్కువగా యాంటీబయోటిక్స్ ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: నిద్రలేమి వల్ల కలిగే ప్రమాదకర ఆరోగ్య సమస్యలివే..?
అయితే కరోనా రోగులు యాంటీ బయోటిక్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నా అవి వైరస్ బారిన పడ్డవారిపై పెద్దగా ప్రభావం చూపలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో 70 శాతం మంది కరోనా రోగులు సాధారణంగా తీసుకోవాల్సిన యాంటీ బయోటిక్స్ తో పోలిస్తే ఎక్కువగా యాంటీ బయోటిక్స్ ను తీసుకున్నారని వెల్లడైంది. అజిత్రోమైసిన్ ను కరోనా రోగులు ఎక్కువగా తీసుకున్నారని సమాచారం.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
శాస్త్రవేత్తలు తరచూ యాంటీ బయోటిక్స్ ను వినియోగించే వాళ్లలో రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు వస్తాయని చెబుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఒకరు తరచూ యాంటీ బయోటిక్స్ ను వాడే వాళ్లు లైంగిక సంక్రమణ వ్యాధులలో ఒకటైన సూపర్ గనేరియా వ్యాధి బారిన పడుతున్నట్టు గుర్తించామని తెలిపారు. వైద్యులు సైతం అవసరం లేకపోయినా యాంటీ బయోటిక్స్ ను ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.