https://oktelugu.com/

కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారా.. ఆ అవయవానికి డేంజర్..?

దేశంలో గ్యాస్ వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తే వంట చేసే సమయంలో పొయ్యి నుంచి పొగ వెలువడుతూ ఉంటుంది. ఈ పొగను పీలిస్తే ప్రాణాంతకమని ఎక్కువగా పొగను పీల్చేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కట్టెలను వంట కోసం వినియోగించడం ద్వారా గాలి కాలుష్యం కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Also Read: మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 23, 2020 / 09:07 PM IST
    Follow us on


    దేశంలో గ్యాస్ వినియోగం అంతకంతకూ పెరుగుతున్నా ఇప్పటికీ పల్లెల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తే వంట చేసే సమయంలో పొయ్యి నుంచి పొగ వెలువడుతూ ఉంటుంది. ఈ పొగను పీలిస్తే ప్రాణాంతకమని ఎక్కువగా పొగను పీల్చేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కట్టెలను వంట కోసం వినియోగించడం ద్వారా గాలి కాలుష్యం కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Also Read: మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    ఎండు కట్టెలను మంటల్లో కాల్చడం వల్ల కట్టెలు కాలే సమయంలో విష వాయువులు వెలువడతాయని.. కొన్ని సందర్భాల్లో ఆ పొగ వల్ల ప్రాణాలకే అపాయం కలుగుతుందని శాస్త్రవేత్తల అధ్యయననంలో వెల్లడైంది. శాస్త్రవేత్తలు ప్రజలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని ఎల్పీజీ గ్యాస్ వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా కట్టెల పొయ్యి నుంచి వెలువడే పొగ వల్లే ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Also Read: యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?

    ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి ద్వారా మూడు బిలియన్ల మంది వంట చేస్తున్నారని తెలుస్తోంది. చాలామంది సామాజిక, ఆర్థిక కారణాల వల్ల నేటికీ కట్టెల పొయ్యినే వంట కోసం వినియోగిస్తున్నారు. కట్టెల పొయ్యి వాడే కుటుంబాలలో ఎక్కువ మంది విషవాయువులను పీలుస్తున్నట్టు తాము గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందరూ అనారోగ్య సమస్యల బారిన పడకపోయినా కొంతమందిలో మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలను గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    కట్టెల పొయ్యిని వినియోగించే వారి కుటుంబాల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన టిష్యూల్లో మార్పులు వచ్చినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీలైనంత వరకు కట్టెల పొయ్యి వినియోగాన్ని తగ్గించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుందని శాస్త్రవేతలు వెల్లడిస్తున్నారు.