మనలో చాలామంది అకౌంట్ లో సంవత్సరాల తరబడి లావాదేవీలు జరపకపోయినా, అకౌంట్ లో తగినంత బ్యాలన్స్ లేకపోయినా, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి పొరపాట్లు చేసినా అకౌంట్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా డీయాక్టివేట్ అయిన అకౌంట్ ను డార్మంట్ అకౌంట్ అంటారు. అయితే డీయాక్టివేట్ అయిన అకౌంట్ లో డబ్బులు లేకపోతే ఇబ్బంది లేదు కానీ డబ్బులు ఉంటే మాత్రం విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి.
Also Read: వాట్సాప్ కు దూరంగా ఉండమని చెబుతున్న కంపెనీలు.. ఎందుకంటే..?
చాలామంది ఈ విషయం తెలియక బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయితే డబ్బులు పొందలేమని భావిస్తూ ఉంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ లలో క్లెయిమ్ చేసుకోని అమౌంట్ ఉంటే సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ అమౌంట్ డీయాక్టివేట్ కావడంతో పాటు అందులో క్లెయిమ్ చేసుకోని డబ్బులు ఉంటే బ్యాంక్ బ్రాంచ్ కు మెయిల్ పంపించడం లేదా బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించడం చేయాలి.
Also Read: ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు..?
ఆ తరువాత బ్యాంక్ అకౌంట్ ఫ్రూప్ తో పాటు ఇతర గుర్తింపు కార్డులను అందజేసి ఇన్ యాక్టివ్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ను మళ్లీ యాక్టివ్ చేయమని కోరాలి. ఇలా కోరిన కొన్నిరోజుల తరువాత బ్యాంక్ అధికారులు ఐడీ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ లను పరిశీలించి సాధ్యమైతే బ్యాంక్ అకౌంట్ ను రీయాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
ఎస్బీఐతో పాటు మరికొన్ని బ్యాంకులు బ్యాంకులకు వెళ్లలేని వాళ్ల కోసం డోర్ స్టెప్ సర్వీసులను అందిస్తున్నాయి. డోర్ స్టెప్ సర్వీసులను వినియోగించుకోవడం వల్ల కూడా బ్యాంక్ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అకౌంట్ ను యాక్టివేట్ చేసుకొని అకౌంట్ లోని డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.