Good Night Drinks :  గుడ్ నైట్ డ్రింక్‌ తాగండి.. ఆరోగ్య ప్రయోజనాలను పొందండి

మనిషికి ఆహారంతో పాటు నిద్ర కూడా ముఖ్యమే. నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి.. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అయితే రాత్రిపూట హ్యాపీగా నిద్రపోవాలంటే కొన్ని గుడ్ నైట్ డ్రింక్‌లను తాగితే చక్కగా పడుకుంటారు. మరి ఈ నైట్ డ్రింక్‌లు ఏవో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 30, 2024 4:50 pm

Good Night Drinks

Follow us on

Good Night Drinks :   ఈరోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార పదార్థాలు, ఎక్కువగా మొబైల్ చూడటం వల్ల రేడియేషన్ వల్ల నిద్ర సరిగ్గా పట్టడం లేదు. రాత్రంతా హ్యాపీగా నిద్రపోవాలని కొందరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయిన కూడా నిద్రలేమి సమస్య పెరుగుతూనే ఉంటుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ చాలామంది ఈరోజుల్లో సోషల్ మీడియాకి అలవాటు పడి ఒక్కో రోజు ఒక్కో సమయానికి నిద్రపోతున్నారు. కొందరు వర్క్ టెన్షన్‌లో బాగా ఒత్తిడి, ఆందోళనకు గురై సరిగ్గా నిద్రపోవడం లేదు. మనిషికి ఆహారంతో పాటు నిద్ర కూడా ముఖ్యమే. నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి.. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అయితే రాత్రిపూట హ్యాపీగా నిద్రపోవాలంటే కొన్ని గుడ్ నైట్ డ్రింక్‌లను తాగితే చక్కగా పడుకుంటారు. మరి ఈ నైట్ డ్రింక్‌లు ఏవో చూద్దాం.

అశ్వగంధ టీ
ఆయుర్వేద మూలికల్లో అశ్వగంధకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మూలికతో టీ చేసుకుని తాగడం వల్ల నిద్ర లేమి సమస్య పరార్ అయిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన సరిగ్గా నిద్రపట్టని వాళ్లు రాత్రిపూట ఈ అశ్వగంధ మూలికలతో చేసిన టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కా పాటిస్తే రిజల్ట్ మీకే తెలుస్తాయి.

గోరువెచ్చని పాలు
నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తాగితే డీప్‌గా పడుకుంటారు. పెద్ద తుపాను వచ్చిన మీరు లేచే ప్రసక్తి లేదు. పాలలోని పోషకాలు నిద్ర సమస్యలను దూరం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.

చెర్రీ జ్యూస్
నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ చెర్రీ పండ్లలో ఎక్కువగా ఉంటుంది. రోజూ ఈ జ్యూస్‌ను తాగడం వల్ల రాత్రంతా హాయిగా నిద్రపోతారు. ఈ జ్యూస్‌తో నిద్రలేమి సమస్య పారిపోతుంది.

పసుపు పాలు
పాలు, పసుపులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్రలేమి సమస్య నుంచి విముక్తి కల్పిస్తుంది. పసుపు యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.

బాదం పాలు
మంచి నిద్రకు కారకమయ్యే ట్రిప్టోఫాన్, మెలటోనిన్, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు, మూలకాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఇవి నిద్రను మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడతాయి. రోజూ నిద్రపోయే ముందు బాదం పాలను తాగడం వల్ల రాతి హాయిగా నిద్ర పడుతుంది.

చామంతీ టీ
శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే చామంతీ టీతో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎండబెట్టిన చామంతీలు లేదా తాజా చామంతీలతో టీ చేసుకుంటే.. రాత్రి పూట బాగా నిద్రపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు నిద్రను మెరుగుపరుస్తాయి. అలాగే చర్మం కూడా కాంతివంతంగా మెరుగుపడుతుంది. రాత్రిపూట ఒక కప్ప చామంతి టీ తాగితే ఇక నిద్రలేమి సమస్య జన్మలో రాదు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.