Devara’ Vijayotsava Sabha : ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆరంభం లో డివైడ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం, ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకెళ్తుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం, వీకెండ్ లో కూడా అదే తరహా జోరుని కొనసాగించి 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. #RRR చిత్రానికి ముందు ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకి ఫుల్ రన్ లో 87 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘దేవర’ చిత్రానికి మొదటి రోజే 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ చిత్రం ఎలాంటి వసూళ్ల సునామీ ని సృష్టించింది అనేది.
ఇంతటి ఘన విజయం అందుకున్న తర్వాత విజయోత్సవ సభ లేకుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు?, అసలు భారీ లెవెల్ లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ సమస్యల కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై అభిమానులు మూవీ టీం పై చాలా ఫైర్ మీద ఉన్నారు. వాళ్లకు కచ్చితంగా ఇప్పుడు విజయోత్సవ సభ కావాల్సిందే. అందుకే మేకర్స్ ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా, కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 2 వ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఈవెంట్ ని వేలాది మంది అభిమానుల సమక్షం లో జరపబోతున్నారట. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నారని టాక్. దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్య ఇలా ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద కనిపించింది 2009 ఎన్నికల సమయంలోనే. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ అభిమానుల మధ్యలోకి రాబోతుంది అనే టాక్ నడుస్తుంది. దీనికి స్పష్టమైన క్లారిటీ మూవీ టీం ఇవ్వాల్సి ఉంది.
ఒక్క ఎన్టీఆర్ కే ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో జన సందోహం ని అదుపుచేయలేక ఈవెంట్ ని క్యాన్సిల్ చేసిన పోలీసులు, ఇప్పుడు ముగ్గురు ఒకే స్టేజిపైకి వస్తే ఎలా మైంటైన్ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడే మాటల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఆయన తన సినిమాకి సంబంధించి అభిమానుల సమక్షం లో మాట్లాడింది #RRR సమయంలోనే. మళ్ళీ ఆ అవకాశం రాలేదు. అలాగే ఈ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మేకర్స్ పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఈ ఈవెంట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.