Heart Problems: పెరుగుతున్న గుండె సమస్యలు… మీ గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే?

ప్రస్తుత కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యువత గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే గుండె సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది.

Written By: Swathi Chilukuri, Updated On : September 30, 2024 8:32 pm

Heart Pain

Follow us on

Heart Problems: ప్రస్తుతం గుండెజబ్బుల వ్యాధిన పడే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య వెంటాడుతుంది. అయితే రీసెంట్ గా జార్ఖండ్‌లో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం రన్నింగ్ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పాల్గొన్న చాలా మంది యువకులు రన్నింగ్ చేస్తుండగానే మరణించారు. ఈ చనిపోయిన చాలా మంది పరిగెత్తుతుండగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందారని తెలుస్తుంది. ఇలాంటి చాలా కేసులు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి. ప్రతిరోజూ ఇందుకు సంబంధించిన కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తుండటంతో ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. పార్టీలో డ్యాన్స్ చేస్తూ కొందరు, జిమ్ చేస్తూ, పాఠాలు చెబుతూ కొందరు ఉన్న దగ్గరే కుప్పకూలి పోతున్నారు. ఆడుతూ, పాడుతూ మరణిస్తున్న కేసులు మొత్తం యువతలో కనిపిస్తున్నాయి.

ప్రస్తుత కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. యువత గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే గుండె సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం గుండె ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాలను గుర్తించేందుకు ఈసీజీ, సీటీ స్కాన్, యాంజియోగ్రఫీ వంటి టెక్నిక్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉంది.

గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..?
యువతరంలో మానసిక ఒత్తిడి, చెడు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి గుండె ఆగిపోవడం, సడన్ గా కుప్పకూలడం, గుండె స్పందన రేటులో మార్పులు ఇలా గుండెకు సంబంధించిన చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే ఏ వయస్సులో ఉన్న వారైనా సరే గుండె ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు వేటలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయవద్దు.

ఈ గుండె సంబంధిత వ్యాధులు ఏవైనా సరే ముందే గుర్తించవచ్చట. వీటికి సంబంధించిన అధునాతన పద్దతులు అందుబాటులో ఉన్నాయని ఢిల్లీలోని ధర్మశిల నారాయణ హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ చెప్పారు. దీనిలో CT స్కాన్, యాంజియోగ్రఫీ అనేది ఇన్వాసివ్ ఇమేజింగ్ టెక్నిక్, ఇది ఎక్స్-రే సాంకేతికతను ఉపయోగించి కొరోనరీ ధమనుల వివరణాత్మక 3D ఇమేజింగ్‌ను అందిస్తుంది. అంటే సకాలంలో కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని గుర్తించడం సులభం అవుతుంది.

గుండె జబ్బులను ఎలా నివారించాలంటే..?
నారాయణ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రచిత్ సక్సేనా మాట్లాడుతూ.. నేడు యువతలో అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు చాలా సాధారణం అయ్యాయి. అయితే చాలా మంది వీటిని పట్టించుకోవడం లేదు. శారీరకంగా తక్కువ శ్రమ చేస్తున్నారు. యువత తాము పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటారు. దీంతో గుండె సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదంటే మరేమైనా ఇతర సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోరు. ఈ నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. అనేక ప్రతికూలతలు ఉన్నాయి. నేటి జీవనశైలిని పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ 30 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు కార్డియాక్ సర్జన్ డాక్టర్ రచిత్ సక్సేనా.